ETV Bharat / bharat

Amul Turnover 2023 : అమూల్ ​@ రూ.72వేల కోట్లు.. సూపర్​ టర్నోవర్​తో దేశంలోనే అతిపెద్ద బ్రాండ్​గా..

author img

By

Published : Aug 20, 2023, 7:42 AM IST

Amul Turnover 2023 : రూ.72వేల కోట్ల టర్నోవర్​తో అమూల్​.. భారతదేశ అతిపెద్ద ఎఫ్​ఎంసీజీ బ్రాండ్​గా అవతరించింది. ప్రపంచంలోనే ఎనిమిదో అతిపెద్ద డెయిరీ కంపెనీ అయిన అమూల్​.. 2022-23లో రూ.11,000 కోట్లు ఆర్జించింది.

amul turnover 2023
amul turnover 2023

Amul Turnover 2023 : డెయిరీ దిగ్గజ సంస్థ అమూల్​.. దేశంలోనే అతిపెద్ద ఎఫ్​ఎంసీజీ (ఫాస్ట్​ మూవింగ్​ కన్జ్యూమర్​ గూడ్స్) బ్రాండ్​గా అవతరించింది. రూ.72వేల కోట్ల రికార్డు టర్నోవర్​ను​ సాధించి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే ఎనిమిదో అతిపెద్ద డెయిరీ కంపెనీ అయిన అమూల్​.. 2022-23లో రూ.11,000 కోట్లు ఆర్జించింది.

గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF) యాజమాన్యంలోని అమూల్.. 49వ AGM(వార్షిక సర్వసభ్య సమావేశం).. శనివారం గుజరాత్​లో జరిగింది. అమూల్ మార్కెటింగ్ బాడీ.. ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. 1973లో కేవలం ఆరుగురు సభ్యులు.. రూ.121 కోట్ల టర్నోవర్‌తో ప్రారంభమైన GCMMF ప్రస్తుతం రాష్ట్రంలో 18 సభ్య సంఘాలను కలిగి ఉంది. మూడు కోట్ల లీటర్ల పాలను సేకరిస్తోంది.

'మూడేళ్లలో రూ.లక్ష కోట్ల టర్నోవర్​!'
GCMMF Turnover : జీసీఎంఎంఎఫ్​ అధ్యక్షుడు శమల్​భాయ్​ పటేల్​.. 2022-23లో తమ సంస్థ 18.5 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. "గత 50 సంవత్సరాలుగా పాడి పరిశ్రమ, రైతులు, వినియోగదారుల మధ్య వారధిగా ఉండాలనే సూత్రాన్ని పాటించి మేం విజయం సాధించాం. త్రిభువన్​దాస్ పటేల్, మోతీభాయ్ చౌదరి, గల్బాభాయ్ పటేల్, భురాభాయ్ పటేల్, జగ్జీవన్​దాస్ పటేల్, జస్వంత్‌లాల్‌ల స్ఫూర్తితో సంస్థ స్థాపించాం. వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో రూ.లక్ష కోట్ల టర్నోవర్ సాధించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం" అని శమల్​భాయ్ పటేల్ తెలిపారు.

'కీలక విభాగాల్లో అనేక విజయాలు'
Amul Turnover India : 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీసీఎంఎంఎఫ్​ చాలా కీలకమైన విభాగాల్లో పలు విజయాలు సాధించదని సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​ జయేన్​ మెహతా తెలిపారు. "అమూల్ మిల్క్​ ప్రొడక్ట్స్​ అమ్మకాల్లో 34 శాతం వృద్ధి ఉంది. ఐస్‌క్రీమ్‌ల విక్రయంలో 40 శాతం, వెన్నలో 19 శాతం, నెయ్యిలో 9 శాతం, అమూల్ లాంగ్‌లైఫ్ మిల్క్​లో 20 శాతం, పెరుగులో 40 శాతం, మజ్జిగ విక్రయాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. మా అతిపెద్ద ఉత్పత్తి అయిన అమూల్ ఫ్రెష్ మిల్క్ 20 శాతం వృద్ధిని నమోదు చేసింది" అంటూ అమూల్​ వృద్ధి శాతాలను వివరించారు.

'దేశంలోని ప్రతి గ్రామానికి..'
దేశంలో పెరుగుతున్న జనాభాతో పాటు తలసరి ఆదాయంలో పెరుగుదల వల్ల రాబోయే సంవత్సరాల్లో జీసీఎంఎంఫ్​ వృద్ధికి మరింత ఊతం లభిస్తుందని సంస్థ వైస్​ ప్రెసిడెంట్​ వాలంజీ హోంబల్ ఆశాభావం వ్యక్తం చేశారు. "దేశంలోని ప్రతి నగరం, పట్టణం, గ్రామంలో మా ఉనికిని చాటేందుకు మేం వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రపంచ డెయిరీ మార్కెట్‌లో గణనీయమైన వృద్ధికి అవకాశం కూడా ఉంది" అంటూ హోంబల్ చెప్పుకొచ్చారు.

'షేక్‌హ్యాండ్‌ వద్దు.. నమస్తే ముద్దు' అంటోంది అమూల్​ పాప

పాల వ్యాపారంలో ఆమె టాప్- ఆదాయం రూ.88లక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.