ETV Bharat / bharat

కశ్మీర్​లో వరుస హత్యలు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష! - కశ్మీర్​పై కేంద్ర హోంశాఖ మంత్రి అధికారాలు

గతకొన్నిరోజులుగా జమ్ముకశ్మీర్‌లో స్థానికేతరులపై ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక భేటీ నిర్వహించింది. అమిత్​ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కశ్మీర్​తో పాటు.. దేశవ్యాప్తంగా ఎదురవుతోన్న భద్రతా సవాళ్లపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు విభాగాల ఉన్నతాధికారులతో అమిత్‌ షా అంతర్గత సమీక్ష నిర్వహించారు.

amit shah
అమిత్ షా
author img

By

Published : Oct 19, 2021, 5:38 AM IST

వలస కూలీలే లక్ష్యంగా జమ్ముకశ్మీర్​లో జరుగుతోన్న దాడుల్లో ఈ నెలలోనే ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సామాన్య పౌరులు, మైనార్టీలపై దాడులు జరుగుతోన్న నేపథ్యంలో జాతీయ భద్రతా విభాగం (ఎన్‌ఐఏ), సీఆర్‌పీఎఫ్‌, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. వీరితో పాటు ఆయా విభాగాల ఉన్నతాధికారులు కశ్మీర్‌లోనే మకాం వేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తాజాగా అక్కడ నెలకొన్న పరిస్థితులతో పాటు దేశవ్యాప్తంగా ఎదురవుతోన్న భద్రతా సవాళ్లపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు విభాగాల ఉన్నతాధికారులతో అమిత్‌ షా అంతర్గత సమీక్ష నిర్వహించారు.

జమ్ముకశ్మీర్‌లో సామాన్య పౌరులపై జరుగుతోన్న దాడులపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర ఆందోళన, విమర్శలు ఎక్కువయ్యాయి. ఆ వరుస ఘటనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అలాంటి దాడులను కట్టడి చేసేందుకు జాతీయ భద్రతా దళం చీఫ్‌తో పాటు ఇంటలిజెన్స్‌, సీఏపీఎఫ్‌ విభాగాలను ఇప్పటికే రంగంలోకి దించింది. వీటితోపాటే జాతీయ భద్రతా వ్యూహాత్మక సమావేశం (NSSC)లో భాగంగా అన్ని రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర బలగాల ఉన్నతాధికారులతో హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌తోపాటు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో నేరాలు, డ్రగ్స్‌ వంటి అంశాలే ఎజెండాగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్గతంగా ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడానికి భద్రతను కట్టుదిట్టం చేసే వ్యూహాలను వీరు చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం ప్రతిఏటా నిర్వహిస్తున్నప్పటికీ.. ఈసారి మాత్రం కశ్మీర్‌లో వరుస హత్యలపైనే ఎక్కువ దృష్టి సారించనున్నట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.

మహిళల తనిఖీలు..

వరుస హత్యల నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు మహిళలను తనిఖీ చేశారు. ఈ మేరకు శ్రీనగర్‌లోని లాల్​చౌక్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ అంశంపై మహిళల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఎదురు కాలేదు. అయితే.. బహిరంగ తనిఖీలు కాకుండా.. తమ హుందాతనాన్ని కాపాడేందుకు.. తాత్కాలిక నిర్మాణాలను ఏర్పాటుచేయాల్సిందని కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గత 30 ఏళ్లలో మహిళలపై తనిఖీలు జరగడం ఇదే మొదటిసారి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.