ETV Bharat / bharat

భాజపా కార్యకర్త కుటుంబానికి షా పరామర్శ - Amit Shah twitter

బంగాల్​లో ఇటీవల మృతిచెందిన భాజపా కార్యకర్త కుటుంబ సభ్యులను కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పరామర్శించారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కార్యకర్తలందరికీ దేశం రుణపడి ఉంటుందని ఘోరీని ఉద్దేశించి ట్వీట్​ చేశారు.

Amit Shah meets family members of Bengal BJP worker killed in judicial custody
బంగాల్​లో భాజపా కార్యకర్త కుటుంబానికి షా పరామర్శ
author img

By

Published : Nov 5, 2020, 11:28 AM IST

జుడీషియల్​ కస్టడీలో ఇటీవల మరణించిన ​బంగాల్ భాజపా కార్యకర్త మదన్​ ఘోరే కుటుంబాన్ని పరామర్శించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. కోల్​కతా విమానాశ్రయంలో బుధవారం రాత్రి వారిని కలిశారు.

Amit Shah tweet
అమిత్​ షా ట్వీట్​

"ధైర్యవంతుడైన ఘోరే కుటుంబానికి నమస్కరిస్తున్నాను. బంగాల్​లో అఘాయిత్యాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి.. గొప్ప త్యాగం చేసిన మన కార్యకార్తలందరికీ దేశం ఎల్లప్పుడూ రుణ పడి ఉంటుది."

- అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

హోం మంత్రితో పాటు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​, ఇతర సీనియర్​ నాయకులు ఘోరే కుటుంబ సభ్యులను కలిశారు.

కిడ్నాప్​ కేసులో నిందితుడైన మదన్​ ఘోరేను సెప్టెంబర్​ 26న అరెస్ట్​ చేశారు పోలీసులు. కేసు విచారణలో భాగంగా జుడిషియల్​ కస్టడీలో ఉన్న ఘోరే.. గత నెల 13న మరణించారు.

అయితే.. ఘోరే హత్యకు గురయ్యాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు.. రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని ఇటీవలే ఆదేశించింది. ఈ నెల 5లోగా శవపరీక్షలు పూర్తిచేసి, 10వ తేదీలోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: కశ్మీర్​: 30 ఏళ్లలో 5 వేలకు పైగా రాజకీయ హత్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.