ETV Bharat / bharat

చైనాకు దడ పుట్టేలా 'ఆకాశ్'​ మిసైల్స్​ పరీక్ష

author img

By

Published : Dec 4, 2020, 5:25 PM IST

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. తమ గగనతలంలోకి శత్రు విమానాలు ప్రవేశిస్తే కూల్చివేస్తామని గట్టి హెచ్చరికలు పంపింది భారత్​. ఈ మేరకు యుద్ధ విమానాలను కూల్చే సామర్థ్యం గల ఆకాశ్​ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది.

Akash missile
'ఆకాశ్'​ మిసైల్స్​ ప్రయోగం

సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనాకు వణుకు పుట్టించేలా క్షిపణి పరీక్షలు చేపడుతోంది భారత్​. తాజాగా శత్రు దేశాల యుద్ధ విమానాలను కూల్చే సామర్థ్యం గల 10 దేశీయ ఆకాశ్ వాయు రక్షణ​ క్షిపణులను పరీక్షించింది భారత వాయుసేన. గత వారం ఆంధ్రప్రదేశ్​లోని సూర్యలంక ఫైరింగ్​ రేంజ్​ నుంచి వీటిని విజయవంతంగా పరీక్షించారు. దాదాపు అన్ని క్షిపణులు లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించినట్లు అధికారులు తెలిపారు.

" విభిన్న పరిస్థితుల్లో శత్రుమూకల విమానాలను కూల్చేందుకు కంబైన్డ్ గైడెడ్ వెపన్స్ ఫైరింగ్-2020లో భాగంగా 10 ఆకాశ్​ మిసైల్స్​ను వాయుసేన పరీక్షించింది. వాటితో పాటు ఇగ్లా షోల్డర్-ఫైర్డ్​ వాయు రక్షణ క్షిపణులనూ పరీక్షించారు. తూర్పు లాద్దాఖ్​తో పాటు ఇతర సెక్టార్లలో ఈ రెండు వ్యవస్థలను మోహరించారు. "

- అధికార వర్గాలు

అత్యంత విజయవంతమైన దేశీయ ఆయుధాలలో ఆకాశ్​ ఒకటిగా తెలిపారు అధికారులు. దేశీయ ఆయుధాలతో యుద్ధాలు చేయాలనే రక్షణ దళాల ఆకాంక్షను ఇవి నెరవేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ క్షిపణులను ఇటీవలే ఆధునికీకరించింది రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ). గతంలో కంటే అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే వ్యవస్థలను ఇందులో పొందుపరిచారు. అత్యంత ఎత్తులోనూ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం గల ఆకాశ్​ ప్రైమ్​ మిసైల్స్​పై డీఆర్​డీఓ పనిచేస్తోంది. భారత సరిహద్దుల్లో చైనా మోహరించిన ఐదోతరం జే-20 ఫైటర్స్​ను సైతం కూల్చేందుకు వాటిలో మార్పులు చేస్తోంది.

ఇదీ చూడండి: నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.