హరియాణాలోని గురుగ్రామ్ నుంచి పంజాబ్‌లోని లూథియానాకు ఓ కొవిడ్ రోగిని తరలించినందుకు గానూ.. రూ.1,20,000 అద్దె చెల్లించాలని ఓ అంబులెన్స్ డ్రైవర్ డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. ఇంత మొత్తం చెల్లించుకోలేని బాధితులు.. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు.
కొవిడ్ రోగి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్ల.. జిల్లా యంత్రాంగం జారీ చేసిన హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేశారు ఆ కుటుంబ సభ్యులు. అయినా.. ఎవరూ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రైవేటు అంబులెన్స్‌ను సంప్రదించి.. ఆస్పత్రికి తరలించామని వారు వాపోయారు.
ఇంత భారీ మెుత్తం డిమాండ్ చేసిన ఆ డ్రైవర్‌పై.. అక్కడి అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ తీవ్రంగా స్పందించింది. అతడిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమైతే.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: అపార్ట్మెంట్లోనే 'మినీ కొవిడ్ కేర్ సెంటర్'