గుజరాత్‌లోని ప్రాథమిక పాఠశాలల ఫలితాల్లో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేసింది. భిలోడా తాలూకాలోని జబ్చితరాయ గ్రామానికి చెందిన ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థి వార్షిక ఫలితాలు చూసి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. రెండు సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులు గరిష్ట మార్కుల కంటే ఎక్కువ మార్కులు ఇచ్చారు.
![amazing-marks-of-gujarat-primary-school-children](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-result-mistake-photo-gj10013jpeg_09052022120951_0905f_1652078391_501_1005newsroom_1652188797_811.jpeg)
గుజరాతీలో 160 మార్కులకు 173.. సైన్స్ అండ్ టెక్నాలజీలో 160 నుంచి 171 మార్కులు వచ్చాయి. అయితే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ వల్లే ఈ తప్పు జరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు సమర్థించుకున్నారు. బనస్కాంతలోని థారద్ ప్రాంతంలోనూ పాఠశాలల ఫలితాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఇందులో సంస్కృతంలో..160కి 165 మార్కులు ఇవ్వగా సాంఘిక శాస్త్రానికి 160కి 174 మార్కులు ఇచ్చారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులే మార్కులను రిపోర్టులో నమోదుచేశారు.
![amazing-marks-of-gujarat-primary-school-children](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-result-mistake-photo-gj10013jpeg_09052022120951_0905f_1652078391_381_1005newsroom_1652188797_245.jpeg)
ఇవీ చదవండి: 'విదేశీ విరాళాల'పై సీబీఐ నజర్.. అదుపులో హోంశాఖ అధికారులు!