దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీలోని దృశ్యాలు తనను షాక్కు గురిచేశాయన్నారు. నిజమైన రైతులు రాజధానిని ఖాళీ చేసి సరిహద్దులకు చేరాలన్నారు.
"దిల్లీలో దృశ్యాలు షాక్కు గురి చేస్తున్నాయి. కొంతమంది సృష్టించిన హింస ఆమోదయోగ్యం కాదు. దీనివల్ల రైతుల పేరు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుంది. నిజమైన రైతులు దిల్లీని వదిలి సరిహద్దుకు వచ్చేయండి."
--పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్
ఇలాంటి ఘటనల వల్ల.. శాంతియుతంగా నిరసనలు చేస్తూ రైతులు ఇంతకాలం తెచ్చుకున్న పేరు పోతుందన్నారు అమరీందర్ సింగ్.
సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన వేళ.. దిల్లీలోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. భద్రత కోసం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. నిబంధనలను పక్కనపెట్టి.. అనుమతులిచ్చిన మార్గాన్ని వీడి ఎర్రకోటవైపు దూసుకెళ్లారు. ఎర్రకోటపై ఓ మతానికి సంబంధించిన జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో దిల్లీవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఇదీ చదవండి : దద్దరిల్లిన దిల్లీ- ఎర్రకోటపై 'రైతు' జెండా