ETV Bharat / bharat

కాంగ్రెస్​ మాజీలకు భాజపా కీలక పదవులు.. జాతీయ కార్యవర్గంలోకి అమరీందర్​, సునీల్ జాఖడ్​ - భాజపా జాతీయ కార్యవర్గం 2022

భాజపా జాతీయ కార్యవర్గం సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్న పలువురు నేతలకు భారతీయ జనతా పార్టీ కీలక పదవులు కట్టబెట్టింది. పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌లకు భాజపా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది.

Former Punjab CM Captain Amarinder Singh and former MP Sunil Jakhar appointed as members of the National Executive

author img

By

Published : Dec 2, 2022, 4:58 PM IST

కాంగ్రెస్‌ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్న పలువురు నేతలకు భారతీయ జనతా పార్టీ కీలక పదవులు కట్టబెట్టింది. గాంధీలకు వ్యతిరేకంగా విమర్శలు చేసి 3నెలలక్రితం హస్తం పార్టీని వీడిన జైవీర్‌ షేర్గిల్‌ను భాజపా అధికార ప్రతినిధిగా నియమించింది. పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌లకు భాజపా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రి స్వతంత్రదేవ్‌ సింగ్‌, ఉత్తరాఖండ్‌ భాజపా మాజీ అధ్యక్షుడు మదన్‌ కౌషిక్‌, కాంగ్రెస్‌ మాజీ నేత రాణా గుర్మిత్‌సింగ్ సోధి, పంజాబ్‌ మాజీ మంత్రి మనోరంజన్‌ కాలియాలను జాతీయ కార్యవర్గం ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఈ మేరకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు.

గుజరాత్ రెండో దశ ఎన్నికల సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలోనే భాజపా జాతీయ కార్యవర్గం సమావేశమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో 2024 లోక్​సభ ఎన్నికలు సహా త్రిపుర, కర్ణాటక రాష్ట్రాల ఎన్నికలు, జీ 20 అంశాలపైన చర్చించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కార్యవర్గ సభ్యులు, పార్టీ సంస్థాగత కార్యదర్శి తదితరులు పాల్గొననున్నారు.

ఇవీ చదవండి: ​గవర్నమెంట్ జాబ్ వదిలేసిన యువతి ఆ వీడియోస్​తో లక్షల్లో సంపాదన

'బ్రేకప్‌ చెప్తానని అన్నందుకే హత్య చేశా'.. నార్కో పరీక్షలో ఆఫ్తాబ్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.