ETV Bharat / bharat

అమెరికా రోడ్డు ప్రమాదం - ఐదుగురు అమలాపురం వాసులు మృతి - Andhra Pradesh road accident news

Amalapuram_Residents_died_in_America
Amalapuram_Residents_died_in_America
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 11:53 AM IST

Updated : Dec 27, 2023, 3:40 PM IST

11:46 December 27

ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులుగా గుర్తింపు

Amalapuram Residents Died in America Road Accident: అమెరికాలోని టెక్సాస్‌‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ముమ్మిడివరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబ సభ్యులుగా అమెరికా అధికారులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో పొన్నాడ నాగేశ్వరరావు, భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన అల్లుడు లోకేశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Officials on Road Accident: అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ''అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెక్సాస్‌ హైవేలో జరిగిన ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. జాన్సన్‌ కౌంటీలో ఉన్న 67వ నంబరు హైవేపై మినీవ్యాన్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయలయ్యాయి. మృతుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమలాపురం వాసులుగా మా దర్యాప్తులో తేలింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాం. గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు'' అని ఘటన వివరాలను వెల్లడించారు.

Thana Members Visited Injured: అమెరికాలోని టెక్సాస్‌‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తానా సభ్యులు ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని పేర్కొన్నారు. తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్‌ సూచన మేరకు తానా ట్రెజరర్‌ అశోక్‌ కొల్లా, ఫౌండేషన్‌ ట్రెజరర్‌ పోలవరపు శ్రీకాంత్‌‌లు ఆసుపత్రికి వెళ్లి, చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

Last Updated : Dec 27, 2023, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.