తమిళ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి ఆదివారం తెరలేవనుంది. 234 సీట్లకు ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించగా.. ఆదివారం కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తమిళ పోరు..
- మొత్తం సీట్లు: 234
- మ్యాజిక్ ఫిగర్: 118
- ఎన్నికలు: ఏప్రిల్ 6
- ప్రధాన పోటీ: అన్నాడీఎంకే X డీఎంకే
- బరిలో ప్రముఖులు: పళనిస్వామి, పన్నీర్‌సెల్వం, స్టాలిన్, కమల్‌హాసన్
ఈసీ చర్యలు
కరోనా నిబంధనల నడుమ కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపట్టింది. ఫేస్ షీల్డ్స్, మాస్కుల పంపిణీ, శానిటైజేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, వారి ఏజెంట్లు.. కచ్చితంగా కరోనా నెగెటివ్ రిపోర్టును చూపించాలి. లేదా టీకా రెండు డోసులు తీసుకున్నట్టు ధ్రువపత్రాలను సమర్పించాలి.
అదే సమయంలో.. కౌంటింగ్ కేంద్రాల బయట ప్రజలు గుమిగూడకుండా చర్యలు చేపట్టింది ఈసీ. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
స్టాలిన్‌కే ప్రజల ఓటు!
ఈ దఫా ఎన్నికల్లో ప్రజలు స్టాలిన్‌కే ఓటు వేశారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మూడోసారి అధికారం చేపట్టాలనుకున్న అన్నాడీఎంకే ఆశలు నెరవేరవని స్పష్టం చేశాయి. మరోవైపు కమల్‌హాసన్, దినకరన్ వంటి వారు ఏ మేరకు ప్రభావం చూపిస్తారన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
![tamilanadu etv bharat exit poll](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11605905_111.jpg)
ఇదీ చూడండి: కేరళ సమరం- కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
ఇదీ చూడండి: బంగాల్ దంగల్‌లో విజేత ఎవరు?