గుజరాత్లో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని పార్కులు, గార్డెన్లను పూర్తిస్థాయిలో మూసేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. గురువారం నుంచి ఈ నిబంధన అమలువుతుందని స్పష్టం చేసింది. కంకారియా సరస్సు, జంతుప్రదర్శనశాలనూ మూసివేయనున్నట్లు పేర్కొంది.
ఇటీవలే నాలుగు మెట్రో నగరాల్లో రాత్రి పూట పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 17 నుంచి మార్చి 31 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌లో అధికంగా కేసులు వెలుగుచూస్తున్నాయి.
ఒక్కరోజు కర్ఫ్యూ...
మధ్యప్రదేశ్‌లోని ఇందోర్, భోపాల్ నగరాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో ఒక్కరోజు రాత్రి(బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం వరకు) కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4.3 శాతానికి పెరిగిందని వెల్లడించారు. 54 శాతం పాజిటివ్ కేసులు ఇందోర్, భోపాల్ నగరాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. బజల్పుర్లోనూ వైరస్ ఉద్ధృతి పెరుగుతోందని చెప్పారు శివరాజ్.
ఇదీ చదవండి:బంగాల్ బొగ్గు స్కాంలో మరొకరు అరెస్ట్