Airport Jobs 2023 : ఏవియేషన్ రంగంలో జాబ్ కోసం చూస్తున్న ఆశావాహులకు గుడ్‌న్యూస్. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) మొత్తం 119 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తిగల యువతీయువకులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
Jr Assistant & Sr Assistant Vacancy 2023 : 119 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
- జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్)- 73
- జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్)- 02
- సీనియర్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్)- 25
- సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్)- 19
కావాల్సిన అర్హతలు(Airport Assistant Jobs 2023 Eligibility Details)
పోస్ట్ పేరు | అర్హతలు |
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) | 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా (మెకానికల్/ ఆటోమొబైల్/ ఫైర్), HMV, LMV లైసెన్సు |
జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) | ఏదైనా డిగ్రీ |
సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) | డిప్లొమా(ఎలక్ట్రానిక్స్, టెలికమ్యునికేషన్/ రేడియో ఇంజినీరింగ్) |
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) | ఏదైనా డిగ్రీ |
వయో పరిమితి (Airport Assistant Jobs 2023 Age Limit)
- కనిష్ఠ వయసు- 18 ఏళ్లు
- గరిష్ఠ వయసు- 30 ఏళ్లు
- నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు(Airport Assistant Jobs 2023 Application Fees)
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్- సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.
- మిగతా కేటగరీలకు చెందిన అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు(Airport Assistant Jobs 2023 Important Dates)
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ- 2023 డిసెంబర్ 27
- దరఖాస్తుకు చివరి తేదీ- 2024 జనవరి 26
అధికారిక వెబ్సైట్
AAI Official Website : పరీక్షా తేదీ, సిలబస్ సహా నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం AAI అధికారిక వెబ్సైట్ www.aai.aero ను సందర్శించవచ్చు.
అప్లై చేసుకోండిలా(How To Apply For Airport Assistant Jobs 2023)
- ముందుగా AAI అధికారిక వెబ్సైట్ www.aai.aero లోకి లాగిన్ అవ్వండి.
- హోంపేజీలో కనిపించే కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు AAI దక్షిణ రీజియన్‌లో కనిపించే Direct Recruitment for Jr.Asst (Fire Service) under SRD, Jr. Asst (Office), Sr.Asst(Electronics), Sr.Asst(Accounts)కు సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక అప్లికేషన్ ఫారాన్ని నింపండి.
- కావాల్సిన డాక్యుమెంట్లన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
- దరఖాస్తు రుసుమును చెల్లించండి
- చివరగా ముందు జాగ్రత్త కోసం దరఖాస్తు పత్రాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి.
ఎల్‌ఐసీలో 250 అప్రెంటీస్ జాబ్స్- అప్లైకు మరో 8 రోజులే ఛాన్స్!
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 ACIO ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!