ETV Bharat / bharat

కాసేపట్లో ల్యాండింగ్​.. పేలిన విమానం టైరు!

Airplane Tire Explosion: విమానం ల్యాండ్​ అవుతుండగా.. టైరు పేలింది. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.

Airplane tire explosion while landing at Kempegowda International Airport

author img

By

Published : Apr 27, 2022, 7:05 PM IST

Airplane Tire Explosion: బెంగళూరు దేవనహళ్లిలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్​ అవుతుండగా.. వెనుక టైరు పేలిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విమానం సురక్షితంగా ల్యాండ్​ అయినట్లు అధికారులు స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.

థాయ్​ ఎయిర్​వేస్​కు చెందిన విమానం బ్యాంకాక్​ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు పేలడం గమనించిన విమానాశ్రయ అధికారులు.. పైలట్​ను అప్రమత్తం చేశారు. దీంతో విమానం సేఫ్​గా ల్యాండ్​ అయింది. అనంతరం.. విమానాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

కొద్దిరోజుల క్రితం ఇలాంటి ఘటనే పుణె ఎయిర్​పోర్ట్​లో జరిగింది. గాల్లో ఉండగా విమానం టైరు పేలిపోయింది. ఈ కారణంగా.. ల్యాండ్​ అవుతుండగా రన్​వే కూడా దెబ్బతింది. దీంతో ఇతర విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయంలోనే నిరీక్షించాల్సి వచ్చింది. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చూడండి: ముఖ్యమంత్రిపై ఎద్దు దాడి.. లక్కీగా..

ముహుర్తం టైం దాటినా బరాత్​లో స్టెప్పులు.. వరుడ్ని చితకబాది, పెళ్లి క్యాన్సిల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.