ETV Bharat / bharat

తమిళనాట పోటాపోటీగా 'ఉచిత హామీల' వల!

author img

By

Published : Mar 15, 2021, 1:18 PM IST

ఉచిత ఇళ్లు, వాషింగ్ మెషీన్లు, గ్యాస్ స్టవ్​లు... అంతేనా! శరణార్థులకు పౌరసత్వం, విద్యారుణాలు మాఫీ, పెట్రోల్ ధరలు తగ్గింపు, మహిళా రిజర్వేషన్లు పెంపు.. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? తమిళనాడు ఓటర్లపై కురుస్తున్న వరాల జల్లులు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు.

One govt job for each family, six LPG cylinders per year: AIADMK manifesto
పోటాపోటీ మేనిఫెస్టోలు.. గెలుపు కోసం కసరత్తులు!

ఎన్నికల సందర్భంగా ఓటర్లపై వరాల జల్లులు కురిపించే సంప్రదాయం తమిళనాడు రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వరుస మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే తాము చేపట్టే కార్యక్రమాలతో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వినూత్న ప్రకటనలు చేస్తున్నాయి.

ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ.. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. అందరికీ 'అమ్మ' ఇళ్లు, ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితం వంటి వరాలు ప్రకటించింది. ప్రతి కుటుంబానికి 'అమ్మ' వాషింగ్ మెషీన్లు, సోలార్ గ్యాస్ స్టవ్​లు అందిస్తామని చెబుతోంది.

stalin releasing party manifesto
పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తున్న పళనిస్వామి-పన్నీర్​సెల్వం

ఇంకా ఏం చెప్పిందంటే?

  • మద్రాస్ హైకోర్టు పేరు తమిళనాడు హైకోర్టుగా మార్పు
  • శ్రీలంక శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం
  • రాజీవ్ గాంధీ హంతకుల విడుదల
  • కుటుంబంలో వృద్ధ మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం
  • ఉచిత కేబుల్ కనెక్షన్
  • పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు చర్యలు
  • ఆటో డ్రైవర్లకు రూ.25 వేల రూపాయల రాయితీతో ఎంజీఆర్ హరిత ఆటోలు

డీఎంకే 500 హామీలు!

ఎన్నికల్లో ఎక్కువ వరాలు ప్రకటించింది డీఎంకే పార్టీనే. స్టాలిన్ నేతృత్వంలోని ఈ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో.. యావద్దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో కలిపి 500 హామీలను ఇచ్చింది. ఎన్నడూ లేని రీతిలో.. హిందువులను ఆకట్టుకునేలా వీరి మేనిఫెస్టో ఉండటం గమనార్హం.

stalin releasing party manifesto
డీఎంకే పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో స్టాలిన్

ఇదీ చదవండి: 75శాతం ఉద్యోగాలు స్థానికులకే.. డీఎంకే మేనిఫెస్టో

  • 30 ఏళ్ల లోపు వ్యక్తుల విద్యా రుణాలు మాఫీ
  • 'తిరుక్కురల్'ను జాతీయ పుస్తకంగా మార్చేందుకు చర్యలు
  • ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు 12 నెలల మాతృత్వ సెలవులు
  • నీట్ పరీక్ష రద్దు.. తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఇందుకోసం చట్టం
  • ప్రభుత్వ ఉద్యోగాల్లో తొలి తరం పట్టభద్రులకు ప్రాధాన్యం
  • శ్రీలంక తమిళులకు పౌరసత్వం
  • ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే లక్ష మందికి రూ.25 వేల చొప్పున నగదు సహాయం
  • ఆవిన్ పాల ధర రూ.3 తగ్గింపు
  • పెట్రోల్​ ధర రూ.5, డీజిల్ ధర రూ.4 చొప్పున తగ్గింపు
  • విద్యను రాష్ట్ర జాబితాలోకి తీసుకొచ్చేందుకు చర్యలు
  • చెరకు మద్దతు ధర టన్నుకు రూ.4 వేలకు పెంపు
  • వరి మద్దతు ధర టన్నుకు రూ.2,500కు పెంపు
  • ప్రభుత్వ లోకల్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
  • మత్స్యకారులకు 2 లక్షల ఇళ్లు
  • పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు తమిళులకే
  • గ్యాస్ సిలిండర్​పై రూ.100 సబ్సిడీ
  • ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ
  • ఇళ్లులేని వ్యక్తుల కోసం నైట్ హోమ్​ల నిర్మాణం
  • జర్నలిస్టుల కోసం సంక్షేమ బోర్డుల ఏర్పాటు
  • విద్యుత్ మోటార్లు కొనుగోలు చేసేందుకు రైతులకు రూ.10 వేల సాయం
  • రేషన్ కార్డు లబ్ధిదారులకు రూ.4 వేల సబ్సిడీ
  • చర్చిలు, మసీదుల ఆధునికీకరణకు రూ.200 కోట్లు
  • ఆలయాల పునరుద్ధరణ కోసం రూ.వెయ్యి కోట్లు
  • ఎనిమిదో తరగతి వరకు అన్ని పాఠశాలల్లో తమిళం బోధన తప్పనిసరి
  • బాలికలకు పాఠశాలల్లో ఉచిత న్యాప్​కిన్లు
  • పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాలు
  • ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లను 30 నుంచి 40 శాతానికి పెంపు
  • గృహిణులకు నెలకు రూ.వెయ్యి

కమల్ పార్టీ సైతం

తమిళనాడులో బరిలో ఉన్న కమల్ హాసన్ నేతృత్వంలోని పార్టీ.. మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) సైతం ఆసక్తికరమైన హామీలను ప్రకటించింది.

ఇదీ చదవండి: 'మా పార్టీ మేనిఫెస్టోను డీఏంకే కాపీ కొట్టింది'

  • యువతకు 50 లక్షల ఉద్యోగాలు
  • యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు
  • ప్రతి జిల్లాలో మహిళలకు ప్రత్యేక బ్యాంకులు
  • రాష్ట్ర యూనిఫాం సర్వీసులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్
  • జల్లికట్టును అంతర్జాతీయ ప్రేక్షక క్రీడగా మార్చడం
  • ఒంటరి తల్లులు తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు సహకారం, వారికి విద్యా, సామాజిక ఆర్థిక పరమైన మద్దతు

ఇలా ప్రతి పార్టీ మరో పార్టీకి దీటుగా మేనిఫెస్టోలు విడుదల చేశాయి. ఇందులో ఏ మేనిఫెస్టో ప్రజల మనసులను దోచుకుంటుందో మే 2న తేలనుంది. తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనుండగా.. మే 2 ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చదవండి: 'నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.