AIADMK Bylaws: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శినని చెప్పుకుంటూ పార్టీలో తన స్థానాన్ని స్థిరపరుచుకోవాలనుకున్న శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. మొదటి నుంచి ఆమెను దూరం పెడతున్న పార్టీ.. ఇప్పుడు ఆమెకు అన్ని దారులు మూసివేసేలా చర్యలు చేపట్టింది. కార్యనిర్వహక కమిటీ సభ్యులు పార్టీ నిబంధనలలో కీలక మార్పులు చేశారు. పార్టీ సమన్వయకర్త, జాయింట్ కోఆర్డినేటర్ స్థానాలకు సింగిల్ ఓటు విధానాన్ని తప్పనిసరి చేస్తూ బైలాస్‌ను సవరించారు. అంటే.. పదవులు రెండు అయినా.. ఒకే ఓటు వేయాల్సి ఉంటుంది. దీంతో ఆ పదవుల్లో కొనసాగుతున్న పన్నీర్‌సెల్వం, పళనిస్వామి స్థానాలను మరింత సుస్థిరం చేశారు.
ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా పార్టీ ప్రాథమిక సభ్యులుగా ఉన్నవాళ్లకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుందని సీనియర్ నేత డీ జయకుమార్ వెల్లడించారు.
2017లో తొలిసారిగా పార్టీ నిబంధనలను అన్నాడీఎంకే సవరించింది. జనరల్ సెక్రటరీ స్థానాన్ని తొలగించి పార్టీ సమన్వయకర్త, జాయింట్ కోఆర్డినేటర్ స్థానాలకు అధికారాన్ని కల్పించింది. రెండు పదవులు ఉన్నా.. సమాన అధికారం ఉండేలా మార్పులు చేసింది.
ఇదీ చూడండి: Delhi Petrol News: పెట్రోల్‌పై వ్యాట్ రూ.8 తగ్గించిన ప్రభుత్వం