ETV Bharat / bharat

స్వాతంత్య్ర సమర యోధుల స్ఫూర్తిని కొనసాగిస్తాం: మోదీ

స్వాతంత్య్ర ఉద్యమంలో అనేక పోరాటాలు, అనేక బలిదానాలను మరోసారి గుర్తుకుతెచ్చుకొని దేశం మొత్తం పునరుత్తేజం అవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ వేడుకల్లో భాగంగా గుజరాత్​లోని సబర్మతీ ఆశ్రమం నుంచి దండి యాత్రను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. స్వాతంత్య సంగ్రామ వీరులకు నివాళులు అర్పించారు.

Ahmedabad: Prime Minister Narendra Modi flags off 'padyatra' from Ahmedabad to Dandi
దండి పాదయాత్రను ప్రారంభించిన మోదీ
author img

By

Published : Mar 12, 2021, 1:05 PM IST

Updated : Mar 12, 2021, 2:17 PM IST

స్వాతంత్య్ర సంగ్రామంలో అమర వీరుల స్ఫూర్తిని కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో.. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకొచ్చిన నేతలందరినీ ప్రధాని కొనియాడారు. గుజరాత్​లోని అహ్మదాబాద్‌లో ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ వేడుకలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా.. సబర్మతీ ఆశ్రమం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దండియాత్రను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమం కోసం శుక్రవారం అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని.. నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ జాతిపిత మహాత్మగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు.

''స్వాతంత్య్ర ఉద్యమంలో అనేక పోరాటాలు, అనేక బలిదానాలను మరోసారి గుర్తుతెచ్చుకొని దేశం మొత్తం పునరుత్తేజం అవుతుంది. ఈ చారిత్రక సందర్భాన నేను మహాత్మగాంధీ పాదాలకు నమస్కరిస్తున్నాను. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తమను తాము అర్పించుకున్న వారికి, దేశానికి నేతృత్వం వహించిన వారికి, అందరూ మహానుభావుల పాదాలకు నమస్సులు సమర్పిస్తున్నాను. ఈ 75 ఏళ్లల్లో దేశాన్ని ఇక్కడివరకూ తీసుకొచ్చిన వారందరికీ ప్రణామాలు. స్వాతంత్య్ర సంగ్రామం, 75 ఏళ్ల ఆలోచనలు, 75 ఏళ్ల విజయాలు, 75 ఏళ్ల చర్యలు, 75 ఏళ్ల పరిష్కారాలు ఈ ఐదు స్తంభాలు.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రేరణగా నిలుస్తున్నాయి."

-ప్రధానమంత్రి నరేంద్రమోదీ

'ఈ వేడుకలు వారికి నివాళి'

స్వరాజ్య భారత కలలను సాకారం చేసేందుకే.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలు నిర్వహిస్తున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. 75 వ స్వాతంత్య్ర వార్షికోత్సవ వేడుకలు.. 2023 ఆగస్టు 15 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఈ స్వాతంత్య్ర సమరయోధులకు ఘన నివాళిగా అమృత మహోత్సవ్‌ వేడుకలు అని ప్రధాని అభివర్ణించారు.

"ఈ మహోత్సవ్‌... దేశ మేల్కొలుపు కోసం. ఈ మహోత్సవ్‌.. స్వరాజ్య కలలను సాకారం చేసేందుకు. ఈ మహోత్సవ్‌... విశ్వశాంతి కోసం. దేశంలో ఉప్పు.. నమ్మకం, విధేయతకు చిహ్నం. మేము దేశం ఉప్పు తిన్నామని మనం ఈరోజుకు చెప్తాం. ఎందుకంటే ఉప్పు మన శ్రమ, సమానత్వానికి ప్రతీక. 1857 స్వాతంత్య్ర సంగ్రామం, మహాత్మగాంధీ పోరాటం, లోకమాన్య తిలక్ సంపూర్ణ స్వరాజ్ పిలుపు, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దిల్లీ మార్చ్‌... ఇప్పటికీ దేశం మరచిపోలేదు. పండిట్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, మౌలానా ఆజాద్‌, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌, వీర్‌సావర్కర్‌ వంటి జన నేతలు స్వాతంత్య్ర సంగ్రామానికి దిశా నిర్దేశం చేశారు. వారు కలలు కన్న భారతాన్ని నిర్మించేందుకు మేము సామూహిక సంకల్పాన్ని తీసుకున్నాం. వారి నుంచి ప్రేరణ పొందుతున్నాం."

-ప్రధానమంత్రి నరేంద్రమోదీ

241 మైళ్ల దూరం 25 రోజుల పాటు కొనసాగనున్న ఈ పాదయాత్ర ఏప్రిల్​ 5న దండిలో ముగుస్తుంది. దేశ ప్రజలను ఏకం చేసిన మహాత్ముడి స్ఫూర్తితో ఈ పాదయాత్ర జరగనుంది. ఈ ప్రదర్శనల్లో దండి మార్చి, మహాత్మ గాంధీ, నేతాజీ, సర్దార్ పటేల్ సహా ఉద్యమ నాయకుల త్యాగాలను ప్రతిబింబించే కార్యక్రమాలు ఉంటాయి.

Last Updated : Mar 12, 2021, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.