తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమ్మ(జయలలిత) అనుచరులంతా ఏకమై విజయం సాధించాలన్నారు ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 73వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం ఏఎంఎంకే పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శశికల ప్రసంగించారు. వందేళ్లయినా తమిళనాడులో ఏఐఏడీఎంకే ప్రభుత్వం కొనసాగాలన్న జయలలిత ఆకాంక్షను ఆమె గుర్తు చేశారు. విజయం కోసం అమ్మ అనుచరులంతా కలిసిగట్టుగా పనిచేయాలని కోరారు.
అయితే.. శశికళ వ్యాఖ్యలపై ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ స్పందించారు. ఆమె ఐకమత్యంపై మాత్రమే మాట్లాడారని వివరించారు. శశికళ వ్యాఖ్యలు పలువురు విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'ఇది తాత్కాలిక సంధి మాత్రమేనని' సీనియర్ రాజకీయ విశ్లేషకులు సుమంత్ రామన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి : 'ఆ రోజు 'అమ్మ' పేరు మీద ప్రతిజ్ఞ చేయండి'