ETV Bharat / bharat

Agra Train Accident : రైలులో ఒక్కసారిగా మంటలు.. రెండు బోగీలు దగ్ధం - యూపీలో రైలు ప్రమాదం

Agra Train Accident Today : పాతాల్​కోట్​ ఎక్స్​ప్రెస్​ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

Agra Train Accident Today
Agra Train Accident Today
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 6:15 PM IST

Updated : Oct 25, 2023, 6:40 PM IST

Agra Train Accident Today : ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రా జిల్లాలో పాతాల్​కోట్ ఎక్స్​ప్రెస్(14624)​ రైలులోని రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

Patalkot Express Fire Accident : జిల్లాలోని మల్పురా పోలీస్ స్టేషన్‌లోని భదాయి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇంజిన్​ నుంచి మూడు, నాలుగు బోగీల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్వో ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు.

  • #UPDATE | Smoke was reported on the train Patalkot Express between Agra- Dholpur. The smoke was noticed in the GS coach, 4th coach from the engine. The train was immediately stopped and Coach detached. No injuries to any person: Indian Railways pic.twitter.com/SgAwZ7t7RF

    — ANI (@ANI) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రా డివిజన్‌లో పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న రెండు కోచ్‌లు కూడా ప్రభావితమయ్యాయి. మొత్తం నాలుగు కోచ్‌లు రైలు నుంచి వేరు చేశాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది" అని ఆగ్రా డివిజిన్​ పీఆర్వో చెప్పారు. ఈ రైలు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుంచి మధ్యప్రదేశ్‌లోని సియోనీ మధ్య నడుస్తున్నట్లు తెలిపారు

"పాతాల్​కోట్​ ఎక్స్​ప్రెస్​ రైలులోని రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. వెంటనే అధికారులు రైలును నిలిపివేసి.. రెండు కోచ్​ను వేరు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు"

-- రైల్వే శాఖ

డెము రైలులో ప్రమాదం.. 5కోచ్​లలో..
Ahmedanagar Train Fire : కొద్ది రోజుల క్రితం.. మహారాష్ట్రలో కూడా ఓ రైలు ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. డెము రైలులోని 5 కోచ్​లలో మంటలు చెలరేగాయి. అహ్మద్​నగర్, నారాయణ్​పుర్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. మంటలు వ్యాపించగానే రైలులో ఉన్నవారిని కిందకు దించినట్లు చెప్పారు. మంటలు చెలరేగిన కోచ్​లలో ఎవరూ చిక్కుకోలేదని, అధికారులు వెంటనే అగ్నిమాపక బృందాలకు సమాచారం అందించారని వివరించారు. రైలు బీడ్ జిల్లాలోని ఆష్టి స్టేషన్ నుంచి అహ్మద్ నగర్​కు వెళ్తోందని అధికారులు తెలిపారు.

Last Updated : Oct 25, 2023, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.