ETV Bharat / bharat

సెప్టిక్​ ట్యాంకులో పడి ఐదుగురు మృతి

సెప్టిక్​ ట్యాంకులో పడి ముగ్గురు మైనర్ సోదరులు సహా మరో ఇద్దరు చనిపోయారు. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

Agra: Three minor brothers, two others drown in septic tank
సెప్టిక్​ ట్యాంకులో పడి ఐదుగురు మృతి
author img

By

Published : Mar 17, 2021, 5:20 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలో విషాద ఘటన వెలుగుచూసింది. సెప్టిక్​ ట్యాంకులో పడి ముగ్గురు మైనర్ సోదరులు సహా మరో ఇద్దరు చనిపోయారు.

ఇదీ జరిగింది

ఫతేహాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి అనురాగ్​(10), హరిమోహన్​(16), అవినాష్​(12), రామ్​ ఖిలాడిలు ఆడుకుంటూ.. సెప్టిక్​ ట్యాంకులో పడిపోయారు. ట్యాంకులో మునిగిపోతున్న వారిని గుర్తించిన సోను(25).. రక్షించే ప్రయత్న చేశాడు. ఈ క్రమంలోనే అతను అందులో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. మరణించినవారిలో హరిమోహన్​, అవినాష్​, అనురాగ్​ సోదరులు.

వారిని బయటకు తీసుకొచ్చిన గ్రామస్థులు.. ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్​ విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఇదీ చూడండి: పోలీసుల కాల్పుల్లో నలుగురు నక్సల్స్​ హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.