ETV Bharat / bharat

Attorney General: 'బాంబే హైకోర్టు తీర్పు హానికరం' - సుప్రీం కోర్టు న్యూస్ టుడే

బాలికను నేరుగా తాకనందున లైంగిక వేధింపులు కాదనడం సరికాదని అన్నారు అటార్నీ జనరల్(Attorney General) కేకే వేణుగోపాల్. బాంబే హైకోర్టు(Bombay HC news) ఇచ్చిన ఈ తీర్పును కొట్టేయాలని సుప్రీం కోర్టును అభ్యర్థించారు.

court, judgement
తీర్పు, కోర్టు
author img

By

Published : Aug 25, 2021, 5:36 AM IST

Updated : Aug 25, 2021, 7:20 AM IST

"బాలిక శరీరాన్ని నిందితుడు నేరుగా తాకనప్పుడు (స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్‌ లేనప్పుడు), ఆ చర్య పోక్సో చట్ట నిబంధనల ప్రకారం లైంగిక వేధింపుల కిందకు రాదు" అంటూ.. బాంబే హైకోర్టు(Bombay HC news) ఇచ్చిన తీర్పును కొట్టేయాలని అటార్నీ జనరల్‌(Attorney General) కె.కె.వేణుగోపాల్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ తీర్పు హానికరమైనదని, అనేక ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఓ బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు (నాగ్‌పుర్‌ ధర్మాసనం) ఈ ఏడాది జనవరిలో తీర్పు వెల్లడించింది. దుస్తులు ధరించి ఉన్న బాలిక ఛాతీ భాగాన్ని నిందితుడు తాకడం పోక్సో చట్టంలో పేర్కొన్న లైంగిక వేధింపుల కిందకు రాదని వ్యాఖ్యానించింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై బాలల హక్కుల కార్యకర్తలు, న్యాయ నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును తప్పుపట్టారు. దీన్ని నిలిపివేయాలంటూ అటార్నీ జనరల్‌(Attorney General)తో పాటు జాతీయ మహిళా కమిషన్‌ కూడా సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది.

ఈ క్రమంలో జనవరి 27న సర్వోన్నత న్యాయస్థానం.. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేసింది. కాగా, ఈ వ్యవహారంపై జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా వేణుగోపాల్‌ మాట్లాడుతూ- "బాంబే హైకోర్టు తీర్పు చాలా ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. రేపొద్దున్న ఎవరైనా చేతులకు సర్జికల్‌ తొడుగులను ధరించి, బాలికల ఛాతీ భాగాలను తాకితే దాన్ని నేరం కాదనే పరిస్థితి రావచ్చు. ఈ కేసులో నిందితుడి చర్య లైంగిక వేధింపుల కిందకే వస్తుంది. భవిష్యత్‌ పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా, బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది" అని పేర్కొన్నారు.

నిందితుడి తరఫున వాదనలు వినిపించేందుకు ఎవరూ హాజరుకాలేదు. దీంతో అతడి తరఫున సీనియర్‌ న్యాయవాది లేదా అడ్వొకేట్‌-ఆన్‌-రికార్డ్‌ను సమకూర్చాలని సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీస్‌ కమిటీని ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో కోర్టు సహాయకులుగా సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ధ్‌ దవేను ఇప్పటికే నియమించినట్టు ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 14కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:సుప్రీంకోర్టు కొలీజియం చొరవ- న్యాయవ్యవస్థలో నారీశక్తి

Last Updated : Aug 25, 2021, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.