ETV Bharat / bharat

'మాదక ద్రవ్యాలతో చీకట్లోకి మానవాళి' - భారత్​లో డ్రగ్స్​

సమాజం నుంచి మాదక ద్రవ్యాలను దూరం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. డ్రగ్స్​ వల్ల మానవాళి చీకటి మయం అవుతుందన్నారు. శనివారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా.. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు.

PM Modi
మోదీ
author img

By

Published : Jun 26, 2021, 12:06 PM IST

Updated : Jun 26, 2021, 12:57 PM IST

మాదకద్రవ్య రహిత భారతాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డ్రగ్స్​ను సమాజం నుంచి తరిమికొట్టేందుకు కృషి చేస్తున్న వారిని ప్రశంసించారు. వారి కృషి.. ఎంతో మంది ప్రాణాలను రక్షించేందుకు ఉపయోగపడుతుందన్నారు. డ్రగ్స్​తో మానవాళి చీకటి మయం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలు దెబ్బతింటాయని ట్వీట్​ చేశారు మోదీ.

"నేడు(జూన్​ 26) అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా సమాజం నుంచి డ్రగ్స్​ను నిర్మూలించేందుకు కృషి చేస్తున్న వారికి నా ప్రశంసలు. వారి ప్రయత్నాలు ప్రజల ప్రాణాలను కాపాడతాయి. డ్రగ్స్ కారణంగా మానవాళి చీకట్లోకి వెళ్తోంది. ప్రజల జీవితాలు దెబ్బతింటున్నాయి."

--ప్రధాని నరేంద్ర మోదీ

ఈ సందర్భంగా 'డ్రగ్స్​ రహిత భారత్' లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు మోదీ. యువత మత్తుకు బానిసకావటం.. స్టైల్ కాదని, ప్రశాంతత కాదని స్పష్టం చేశారు.

భారత్​లో మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గతంలో సందేశం ఇచ్చిన మన్​కీ బాత్ వీడియోను ట్విట్టర్​లో జత చేశారు మోదీ.

ఇదీ చదవండి : DRUGS: యువతరంపై మాదక ఖడ్గం

కరోనా వేళ భారీగా పెరిగిన డ్రగ్స్​ వినియోగం!

Last Updated : Jun 26, 2021, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.