ETV Bharat / bharat

చైనా గూఢచారి ఫోన్ పాస్​వర్డ్​ తీయలేకపోతున్నారా?

చైనా గూఢచారి హాన్ జున్వేను భారత సరిహద్దులో పట్టుకుని రోజులు గడుస్తున్నా.. విచారణ మాత్రం ముందుకు సాగటం లేదు. జున్వే నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్​టాప్, మొబైల్​ ఫోన్​ పాస్​వర్డ్​లను తీయటంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయి. అయితే పాస్​వర్డ్​లు తీయటం పెద్ద కష్టమైన పని కాదని.. జాతీయ భద్రత దృష్ట్యా సమాచారాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని ఓ మాజీ ఎన్​ఎస్​జీ అధికారి అభిప్రాయపడ్డారు.

Chinese spy
చైనా గూఢచారి
author img

By

Published : Jun 20, 2021, 12:51 PM IST

జూన్​ 10న భారత్‌- బంగ్లాదేశ్​ సరిహద్దుల్లో చైనా దేశస్థుడైన హాన్ జున్వేను జాతీయ భద్రత దళాలు పట్టుకున్నాయి. అతని నుంచి ల్యాప్​టాప్, మొబైల్​ ఫోన్​లను స్వాధీనం చేసుకున్నాయి. అయితే.. ఇప్పటికీ వాటి పాస్​వర్డ్​లను ఛేదించడంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ), బంగాల్ పోలీసు విభాగంలోని స్పెషల్ టాస్క్​ ఫోర్స్(ఎస్​టీఎఫ్​)లు విఫలమవుతూ వస్తున్నాయి. వాటి పాస్​వర్డ్​లను తీస్తే జాతీయ భద్రతకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అదే కారణమా..?

చైనా గూఢచారి హాన్ జున్వే.. తన ల్యాప్​టాప్, మొబైల్​ ఫోన్ పాస్​వర్డ్​లను మాండరిన్​(చైనా అధికార భాష)లో భద్రపరిచాడని అందువల్ల వాటిని క్రాక్ చేయటం కష్టతరమవుతోందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. జున్వే పరికరాలను దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించామని తెలిపాయి.

మనవాళ్లకు ఏదైనా సాధ్యమే..

అయితే ఈ అంశంపై ఎన్​ఎస్​జీ మాజీ అధికారి దీపాంజన్ చక్రవర్తి 'ఈటీవీ భారత్'​తో మాట్లాడారు. గోప్యత కోసమే పాస్​వర్డ్ ఛేదించిన విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ప్రపంచంలో ఎలాంటి పాస్​వర్డ్​లనైనా క్రాక్​ చేయగల సామర్థ్యం ఎన్ఎస్​జీ, ఎన్​ఐఏ బృందాలకు ఉంది. కానీ జాతీయ భద్రత, భారత్​- చైనా సంబంధాల దృష్ట్యా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే సమాచారం బయటపడితే.. మిగతా వారు అప్రమత్తమయ్యే అవకాశం ఉంది."

-దీపాంజన్ చక్రవర్తి, ఎన్​ఎస్​జీ మాజీ అధికారి

హాన్ జున్వే.. నకిలీ పత్రాలతో సిమ్‌ కార్డులు సంపాదించి, వాటిని అక్రమంగా చైనాకు తరలించడం సహా ఆర్థికనేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. గురుగ్రామ్‌లో జున్వే ఓ హోటల్‌ సైతం నడుపుతున్నట్లు తేలింది. ప్రస్తుతం ఆయన బంగాల్ ఎస్​టీఎఫ్​ కస్టడీలో ఉన్నాడు.

ఇదీ చదవండి : చైనా గూఢచారి.. పదేళ్లుగా భారత్​లోనే..!

హైదరాబాద్‌లో చైనా వేగు జాడలతో పోలీసుల అప్రమత్తం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.