ETV Bharat / bharat

Drug smuggling: పొట్టలో రూ.11కోట్లు విలువైన కొకైన్​ - కొకైన్ తరలిస్తున్న ముఠా

కొకైన్​ను(cocaine) అక్రమంగా తరలిస్తున్న(drug smuggling) ఆఫ్రికా​ దేశస్థుడిని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు అధికారులు. రూ. 11 కోట్ల విలువైన మత్తుపదార్థాన్ని(Narcotics) పొట్టలో దాచుకుని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

cocaine carrying
కొకైన్ తరలింపు inside the stomach
author img

By

Published : Aug 22, 2021, 10:12 AM IST

1.25 కేజీల కొకైన్​(drug smuggling) ప్యాకెట్లను పొట్టలో దాచుకుని తరలిస్తున్న ఆఫ్రికా దేశస్థుడు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. అతను దుబాయ్​ నుంచి వచ్చాడు. విమానంలో ఇచ్చిన ఆహారాన్ని, నీటిని అతడు తీసుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు.. అతడిని స్కాన్​ చేయగా పొట్టలో కొకైన్ పదార్థం ఉన్నట్లు గుర్తించి.. అరెస్ట్ చేశారు.

వైద్యుల సహాయంతో కొకైన్​ను బయటకు తీశారు. కొకైన్​(cocaine) విలువ రూ.11 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

దక్షిణాఫ్రికాలో ఓ గుర్తుతెలియని వ్యక్తి.. నిందితుడిని బెంగళూరుకు పంపించాడు. అతడికి ఓ లగ్జరీ హోటల్​లో గది బుక్ చేశాడని.. అధికారుల విచారణలో తేలింది.

ఇదీ చదవండి: drugs: పొట్టలో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.