ETV Bharat / bharat

Afghan crisis: భారత్​కు సురక్షితంగా మరో 146 మంది

author img

By

Published : Aug 23, 2021, 11:44 AM IST

Updated : Aug 23, 2021, 2:02 PM IST

తాలిబన్ల ఆక్రమణతో(Afghan crisis) అఫ్గాన్​ నుంచి భారత పౌరుల తరలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో నాటో, అమెరికా విమానాల ద్వారా కతార్​కు చేరుకున్న 146 మంది భారతీయులను(india evacuation afghanistan) స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్రం. మొత్తం నాలుగు విమానాల్లో వారు భారత్​ తిరిగొచ్చారు.

AFGHAN-INDIA EVACUATION
స్వదేశానికి 146 మంది భారతీయులు

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్న(Afghan crisis) క్రమంలో ఆ దేశం నుంచి తమ వారిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం. ఈ క్రమంలోనే నాటో, అమెరికా విమానాల్లో అఫ్గాన్​ నుంచి కతార్​కు చేరిన భారతీయులను(india evacuation afghanistan) సోమవారం స్వదేశానికి తీసుకొచ్చింది. దోహా విమానాశ్రయం నుంచి 4 విమానాల్లో మొత్తం 146 మందిని భారత్​ తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. కాబుల్​ నుంచి తరలించిన వారిలో దోహా నుంచి తీసుకొచ్చిన రెండో బ్యాచ్​గా చెప్పారు.

AFGHAN-INDIA EVACUATION
దిల్లీ చేరిన భారత పౌరులు

దోహా నుంచి 104 మంది విస్తారా విమానం, 30 మంది కతార్​ ఎయిర్​వేస్​ విమానం, 11 మంది ఇండిగో, ఒకరు ఎయిర్​ ఇండియా విమానం ద్వారా భారత్​ చేరినట్లు అధికారులు తెలిపారు.

AFGHAN-INDIA EVACUATION
దిల్లీ విమానాశ్రయంలో బస్సులోకి ఎక్కుతున్న భారత పౌరులు

ఆదివారం తొలి బ్యాచ్​లో మూడు విమానాల ద్వారా మొత్తం 392 మందిని భారత్​కు తీసుకొచ్చింది కేంద్రం. అందులో ఇద్దరు అఫ్గాన్​ చట్టసభ్యులు కూడా ఉన్నారు. కాబుల్​ నుంచి దోహాకు చేరుకున్న భారతీయుల్లో చాలా మంది విదేశీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఉన్నట్లు తెలిసింది.

ఇద్దరికి కరోనా..

అఫ్గానిస్థాన్​ నుంచి భారత్​కు వచ్చిన 146 మందిలో ఇద్దరికి కొవిడ్​-19 పాజిటివ్​గా తేలింది. విమానాశ్రయంలో దిగిన తర్వాత అందరికీ పరీక్షలు నిర్వహించామని, అందులో ఇద్దరికి వైరస్​ నిర్దరణ అయినట్లు దిల్లీ ప్రభుత్వ నోడల్​ అధికారి రాజేందర్​ కుమార్​ తెలిపారు.

AFGHAN-INDIA EVACUATION
బస్సు వద్ద భారతీయులు

ఇదీ చూడండి: Afghan news: తాలిబన్​ చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి..

Afghan: తాలిబన్ల నుంచి తప్పించి.. సూపర్​ వుమన్​గా నిలిచి!

Afghan crisis: ఆకలి మరచి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.

Last Updated : Aug 23, 2021, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.