ETV Bharat / bharat

విదేశీ జంటను భారత రాజ్యాంగం కలిపిందిలా!

భరతమాత సాక్షిగా విదేశీ జంట ఒక్కటైంది. వారు కలిసి బతకాలంటే ఒకరి దేశంలో తాలిబన్ల సమస్య.. మరొకరి దేశానికి వెళ్లాలంటే వీసా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి అండగా నిలిచింది భారత న్యాయవ్యవస్థ. వారి ప్రేమ వివాహాన్ని చట్టబద్ధం చేసి.. సమస్యను తీర్చింది. అసలు జరిగిన కథేంటంటే?

foreigners marriage
విదేశీ జంట
author img

By

Published : Aug 14, 2021, 5:53 PM IST

అఫ్గాన్​ అమ్మాయి, ఫ్రాన్స్ అబ్బాయిని భారత రాజ్యాంగం కలిపింది. సొంతదేశం వెళ్లేందుకు ఎదురైన సమస్యలను పరిష్కరించింది. వారి కథ సుఖాంతం అయ్యేందుకు దోహదం చేసింది.

అసలేమైందంటే..

వేరు వేరు పనుల మీద భారత్​కు వచ్చిన ఈ ఇద్దరు విదేశీయులు.. ఇక్కడే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, భరతమాత సాక్షిగా ఒక్కటైన ఈ జంట తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకరి దేశంలో తాలిబన్​ సమస్యతో అఫ్గాన్​ ప్రజలు స్పేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశం లేదు. దీంతో వారిరువురు ఫ్రాన్స్​కు వెళ్లి జీవించాలని అనుకున్నారు. అయితే ఆ దేశానికి వెళ్లేందుకు యువతికి వీసా లేదు.

వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేయిస్తేనే వీసా జారీ చేస్తామని ఫ్రాన్స్ ఎంబసీ స్పష్టం చేసింది. వివాహాన్ని రిజిస్టర్ చేయించాలంటే ఆధార్, లేదా ఇతర గుర్తింపు కార్డులు అవసరం. ఇద్దరూ విదేశీయులే కావడం వల్ల.. స్థానిక గుర్తింపు కార్డులేవీ వీరి వద్ద లేవు.

కానీ, సమస్య పరిష్కారానికి భారత రాజ్యాంగం, దేశంలోని కొన్ని ప్రత్యేక చట్టాలు దోహదం చేశాయి. వీరి కథ సుఖాంతం అవ్వడానికి ఓ లాయర్​ సహకరించారు. యువతీయువకుల తరఫున దిల్లీ హైకోర్టును ఆశ్రయించి కేసును మలుపుతిప్పారు. ఆయనే దివ్యాంశు పాండే.

"ఫ్రాన్స్ యువకుడు, అఫ్గాన్​ యువతి ఇరువురు ప్రేమించుకున్నారు. వారు దిల్లీలోని ఓ మసీదులో వివాహం చేసుకున్నారు. కానీ తిరిగి తమ దేశానికి వెళ్లేందుకు వారికి వీసా సమస్య ఎదురైంది. ఇందుకుగానూ రాజ్యాంగంలో ఉండే ప్రత్యేక వివాహ చట్టం కింద వారి పెళ్లిని పరిగణించాలని దిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానికంగా ఉండే పద్ధతుల ప్రకారం విచారణ పూర్తయిన 30 రోజుల్లో ఆమెకు వీసా లభిస్తుంది. ఆ ప్రకారంగా వారు సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌కు వెళ్లవచ్చు."

-దివ్యాంశు పాండే, విదేశీ దంపతుల తరపు న్యాయవాది

ఏమిటీ నిబంధన..

భారత రాజ్యాంగంలోని సెక్షన్​ 14 ప్రకారం.. విదేశీయులు భారత్​లో వివాహం చేసుకుంటే వారికి ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోయినా ప్రత్యేక వివాహంగా పరిగణించాలి.

ఇదీ చూడండి:వాఘా సరిహద్దుల్లో పాక్​ స్వాతంత్ర్య వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.