ETV Bharat / bharat

విమానాలతో శానిటైజేషన్- గాలిలో కరోనాకు చెక్​! - బెంగళూరు కరోనా వార్తలు

గాలిలో కరోనా వ్యాపిస్తోందని ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో పరిష్కార మార్గాన్ని తీసుకొచ్చింది ఏరియల్​వర్క్స్​ ఏరో ఎల్​ఎల్​పీ అనే సంస్థ. గాలిలో అతి తక్కువ పరిమాణంలో ఉండే సేంద్రీయ ద్రావణాన్ని పిచికారీ చేస్తూ.. దీర్ఘకాలం పాటు బ్యాక్టీరియాను అంతమొందిస్తోంది.

AERIAL SPRAYING OF ORGANIC DISINFECTANT
గాలిలో సేంద్రీయ ద్రావణ పిచికారీ
author img

By

Published : May 30, 2021, 5:33 PM IST

గాలిలో సేంద్రీయ ద్రావణ పిచికారీతో వైరస్​కు అడ్డుకట్ట

గాలి ద్వారా కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనల మధ్య వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది ఏరియల్​వర్క్స్​ ఏరో ఎల్​ఎల్​పీ అనే సంస్థ. చిన్నపాటి విమానాల సాయంతో క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తోంది.

AERIAL SPRAYING OF ORGANIC DISINFECTANT
ద్రావణాన్ని పిచికారీ చేస్తోన్న విమానం

ఆఫ్రికా, అమెరికాలో ఇప్పటికే ఈ సంస్థ భారీ స్థాయిలో ఏరియల్​ స్ప్రే పనులు చేపట్టింది. ఆధునిక సాంకేతికతతో సేంద్రీయ ద్రావణాన్ని మైక్రాన్ల పరిమాణంలో పిచికారీ చేసి, గాలిలో ఎక్కువ సమయం ఉండేలా చేస్తుంది. దాంతో గాలి తుంపర్లలో తేలియాడే బ్యాక్టీరియా, వైరస్​ను నశింపజేసి, కొవిడ్​ సోకే ముప్పును తగ్గిస్తుంది.

బెంగళూరులోని అత్యధిక జనాభా గల ప్రాంతాల్లో పిచికారీ కోసం ఏరోవర్క్క్​ తో 3 రోజుల పైలట్​ ప్రాజెక్టును ప్రారంభించారు కర్ణాటక ఆర్థిక మంత్రి ఆర్​.అశోక్.

AERIAL SPRAYING OF ORGANIC DISINFECTANT
పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన ఆర్థికమంత్రి ఆర్​.అశోక్

300 లీటర్ల లోడింగ్​ సామర్థ్యంతో గంటకు 741 ఎకరాల్లో అమెరికన్​ ఛాంపియన్​ స్కౌట్​ విమానంతో క్రిమిసంహాకర ద్రావణాన్ని పిచికారీ చేస్తోంది ఏరోవర్క్స్​ ఎల్​ఎల్​పీ. మంచి ఫలితాల కోసం ఐసీఎంఆర్​ ధ్రువీకరించిన ఎయిర్​లెన్స్​ మైనస్ కరోనా, సుగరధాన అనే రెండు రకాల సేంద్రీయ ద్రావణాల్ని వాడుతోంది. ఈ రెండూ రసాయన రహిత, మానవ సురక్షిత ద్రావణాలు.

ఇదీ చూడండి: ఐఐటీ కాన్పుర్ కనిపెట్టిన ఈ పరికరంతో​ కరోనా కట్టడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.