బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి.. భాజపాలో చేరారు. కోల్‌కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ వేదికగా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మిథున్. బంగాల్ భాజపా నేతలు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.
బంగాల్ శాసన సభకు 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మిథున్ చక్రవర్తి భాజపాలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతకుముందు.. భాజపా ప్రధాన కార్యదర్శి, పార్టీ తరఫున బంగాల్ ఎన్నికల పరిశీలకులు కైలాశ్ విజయ్ వర్గీయ.. మిథున్ చక్రవర్తిని శనివారం కలిశారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు.
2014లో టీఎంసీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మిథున్.. 2016 డిసెంబర్లో రాజీనామా చేశారు. తాజాగా భాజపాలో చేరారు.
ఇదీ చూడండి:- 'టీఎంసీ గెలిస్తే బంగాల్.. కశ్మీర్‌లా తయారవుతుంది'