ETV Bharat / bharat

'ట్విట్టర్ అయినా, ఇంకెవరైనా.. చర్యలు తప్పవు' - రాజ్యసభలో ట్విట్టర్​కు రవి శంకర్ ప్రసాద్ వార్నింగ్

సామాజిక మాధ్యమాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హింసను రాజేసేందుకు వీటిని ఉపయోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. భారత్​లోని చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియాలు నడుచుకోవాలని హితవు పలికింది. ఒక్కో దేశంలో ఒక్కో విధానాలు అనుసరించడం తగదని సూచించింది.

Action will be taken if Twitter, FB platforms are misused: Govt
'ట్విట్టర్ అయినా ఇంకెవరైనా.. చర్యలు తప్పవు'
author img

By

Published : Feb 11, 2021, 3:34 PM IST

దుష్ప్రచారాలు, హింసకు ప్రేరేపించే వార్తల విషయంలో సామాజిక మాధ్యమాలకు కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆర్టికల్ 19ఏ ప్రకారం స్వేచ్ఛా హక్కు ఉన్నప్పటికీ.. దానికి సహేతుకమైన పరిమితులు ఉన్నాయని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. సోషల్ మీడియా సంస్థలు భారత్​లోని చట్టాలకు అనుగుణంగానే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్యసభ వేదికగా హెచ్చరించారు.

"సాధారణ పౌరులను చైతన్యపరుస్తున్న సామాజిక మాధ్యమాలను గౌరవిస్తాం. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సామాజిక మాధ్యామాలది పాత్ర ఎనలేనిది. కానీ, తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకు, హింసను ప్రేరేపించేందుకు వీటిని ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటాం. అది ట్విట్టర్ అయినా, ఎవరైనా."

-రవి శంకర్ ప్రసాద్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి

వేర్వేరు దేశాలకు వేర్వేరు ప్రమాణాలు ఉండకూడదని రవిశంకర్ అన్నారు. అమెరికా క్యాపిటల్ హిల్ ఘటనలో ఒక రకంగా వ్యవహరించి, ఎర్రకోట ఘటనలో మరో విధంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు.

ప్రభుత్వాన్ని, ప్రధానిని విమర్శించే హక్కు ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిందని, అయితే తప్పుడు వార్తల వ్యాప్తిని అనుమతించేది లేదన్నారు. సామాజిక మాధ్యమాలన్నీ దేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ట్విట్టర్​కు మరోమారు కేంద్రం వార్నింగ్!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.