మధ్యప్రదేశ్ ఉజ్జయనీ జిల్లాలో దారుణం జరిగింది. నీలంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని లవకుశ్ నగర్‌లో గోవింద్ అనే యువకుడిని కొందరు వ్యక్తులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలైన బాధిత యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు.
దాడికి సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి చరవాణిలో బంధించడంతో మే 28న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అశు, విశాల్, భాయి, లాలా, సాగర్, గోలు తో సహా ఇతరులు ఈ దాడిలో పాల్గొన్నట్లు ఎస్పీ అమరేంద్ర సింగ్ తెలిపారు. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: Viral: విష సర్పానికి నోటితో ఆక్సిజన్!