ETV Bharat / bharat

యాక్సెంచర్ ఉద్యోగులకు షాక్​.. 19వేల మందిపై వేటు! - 19 వేల మంది యాక్సెంచర్ ఉద్యోగులకు ఉద్వాసన

ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్​ తమ ఉద్యోగులకు చేదు వార్త వినిపించింది. తమ సంస్థలో పనిచేసే 19 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది.

accenture layoffs 2023
2022 యాక్సెంచర్ లేఆఫ్స్​
author img

By

Published : Mar 23, 2023, 8:00 PM IST

Updated : Mar 23, 2023, 9:55 PM IST

ఐటీ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, ఎరిక్సన్, ఫిలిప్స్​, యాహూ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టాయి. తాజాగా ఐర్లాండ్‌కు చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్ కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19 వేల మందిని విధుల నుంచి తొలగించనున్నట్లు వెల్లడించింది. ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వార్షిక ఆదాయ వృద్ధిరేటు, లాభాల అంచనాలను కూడా స్వల్పంగా తగ్గించిన్నట్లు పేర్కొంది. అయితే భారత్‌లో ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నది కంపెనీ ప్రకటించలేదు.

ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం సాంకేతిక పరమైన పెట్టుబడుల నియంత్రణలో భాగంగానే ఈ తొలగింపులను చేపట్టినట్లు యాక్సెంచర్​ ప్రకటించింది. తద్వారా ఈ భారీ తొలగింపులతో సంస్థ వార్షిక ఆదాయ వృద్ధి, లాభాల అంచనాలు కూడా తగ్గనున్నాయని తెలిపింది. యాక్సెంచర్ తీసుకున్న ఈ నిర్ణయంతో కంపెనీలోని నగదు రహిత కార్యాకలాపాల ఉద్యోగులపై ప్రభావం పడనుందని రాయిటర్స్​ నివేదించింది. కాగా, తాజాగా ప్రకటించిన 19 వేల ఉద్యోగుల తొలగింపు కారణంగా సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 2.5 శాతం మంది ఉపాధి కోల్పోనున్నారని రాయిటర్స్​ పేర్కొంది. అయితే స్థానిక కరెన్సీ లెక్కల ప్రకారం కంపెనీ వార్షిక రాబడి వృద్ధి గతంలో 8 నుంచి 11 శాతంగా ఉండేదని.. తాజా ఉద్వాసనలతో అది 8 నుంచి 10 శాతాంగా ఉండబోతోందని రాయిటర్స్​ అంచనా వేసింది.

ఐటీ సంస్థల్లో లేఆఫ్స్​ పరంపర..
గతేడాది ప్రారంభమయిన ఈ లేఆఫ్స్​ పరంపర 2023లో మరింత ఊపందుకుంది. జనవరి నుంచి ఇప్పటివరకు వందలాది కంపెనీలు లక్షల మంది ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించాయి. అమెజాన్, ఫేస్​బుక్​, ట్విట్టర్, గూగుల్, యాహూ, డిస్నీ, డెల్​, ఫిలిప్స్, ఐబీఎమ్​, మైక్రోసాఫ్ట్, మెటా, హెచ్ఎస్​బీసీ, హెచ్​పీ కంపెనీలతో సహా జొమాటో, స్విగ్గీ ఫుడ్​ డెలివరీ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు లేఆఫ్స్​ ప్రకటించాయి. వివిధ బడా కంపెనీలు కలిసి లక్షలాది మంది ఉద్యోగులను విధుల నుంచి తొలిగించాయి.

ఇంకెన్ని కంపెనీలు లేఆఫ్స్​ బాటలో..?
ఈ ఏడాది టెక్​ కంపెనీలు తమ ఉద్యోగులను భారీ స్థాయిలో తొలగిస్తున్నాయి. తాజాగా దిగ్గజ కంపెనీ అమెజాన్ 9000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది. దీంతో జనవరి నుంచి మొదలైన ఈ రెండు విడతల తొలిగింపు ప్రక్రియ ద్వారా దాదాపు 18000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో మున్ముందు ఇంకెన్ని కంపెనీలు ఈ లేఆఫ్స్​ బాట పట్టనున్నాయో అనే భయాందోళనకు గురవుతున్నారు ఉద్యోగులు.

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగుల ఉద్వాసనకు ఉపక్రమించాయి. అయితే పలు కంపెనీలు ఏటా చేపట్టే పనితీరు ఆధారిత మదింపు ప్రక్రియలో భాగంగా ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను జరుపుతున్నామని చెబుతున్నాయి. మరి కొన్ని సంస్థలు కరోనా కారణంగా ఉత్పన్నమైన నష్టాలను నివారించుకునేందుకనే కారణాలను సాకుగా చూపెడుతున్నాయి.

Last Updated : Mar 23, 2023, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.