Explosives Seized in UP: ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముందు పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. బందా జిల్లాలోని చిల్లా పోలీసు స్టేషన్ పరిధిలో 28 కిలోలకుపైగా భారీగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
"గత రాత్రి బందా జిల్లాలోని చిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో 28 కిలోలకుపైగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు" అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సత్యప్రకాశ్ శర్మ తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
UP Elections: ఉత్తర్ప్రదేశ్లో ఏడు విడతల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10న మొదలై మార్చి 7 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి- 10, 14, 20, 23, 27 సహా మార్చి- 3,4 తేదీలలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.
మార్చి 10న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.
ఇదీ చూడండి: 'సమాజ్వాదీ'కి ఎదురుదెబ్బ.. భాజపాలోకి ములాయం కోడలు!