Abhilasha Barak: నాన్న కల్నల్ ఎస్ ఓం సింగ్ మిలిటరీ ఆఫీసర్. ఊహ తెలిసినప్పటి నుంచీ యూనిఫాం ధరించిన సైనికుల మధ్యే పెరిగింది. దీంతో అదో పెద్ద విషయమని ఆమెకి అనిపించలేదు. కానీ నాన్న 2011లో పదవీ విరమణ పొందారు. దీంతో వాళ్ల కుటుంబం హరియాణాకు మారిపోయింది. అన్న కూడా నాన్న బాటలోనే ఆర్మీలో చేరాడు. 2013లో మిలటరీ అకాడమీ నుంచి ఉత్తీర్ణత పొంది పెరేడ్‌లో పాల్గొన్న అతన్ని చూశాక తనకూ అటువైపు వెళ్లాలనిపించింది. అభిలాష.. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. యూఎస్‌లోని ప్రముఖ సంస్థలో ఉద్యోగాన్నీ సాధించింది. కానీ వాటిని కాదని ఆర్మీ వైపు వెళ్లింది. 2018లో చెన్నైలోని ఆర్మీ అకాడమీ నుంచి శిక్షణ పూర్తి చేసుకుంది. తర్వాత ఆర్మీ డిఫెన్స్‌ను ఎంచుకుంది.
ఆర్మీ ఏవియేషన్‌కి దరఖాస్తు చేేసుకునేప్పటికి యుద్ధ విభాగాల్లోకి అమ్మాయిలకు అనుమతి లేదు. గ్రౌండ్ డ్యూటీకే పరిమితమవుతానని తెలుసు. అయినా కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు చేశా. మొదటి ప్రయత్నంలోనే విజయవంతమూ అయ్యా. ఎప్పటికైనా అమ్మాయిలకీ యుద్ధంలో పాల్గొనే అవకాశమొస్తుందన్నది నా నమ్మకం. అనుకున్నట్టుగానే వచ్చింది. దాన్ని గట్టిగా ప్రయత్నించా. నాసిక్‌లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ నుంచి విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకొని తొలి యుద్ధ పైలట్‌నయ్యా. ఆర్మీ ఏవియేషన్ డీజీ ఏకే సూరి నుంచి పట్టానీ, ప్రత్యేక పురస్కారాన్నీ అందుకున్నా. 1987.. ఆపరేషన్ మేఘ్‌దూత్! వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. నాన్న ఆ పరిస్థితుల్లో నాయకత్వం వహిస్తూ జబ్బుపడ్డారు. హుటాహుటిన వేరే ప్రాంతానికి తరలించడంతో మాకు దక్కారు. ఆర్మీ ఏవియేషన్ కోసం ఆయన తన ప్రాణాల్నీ పణంగా పెట్టారు. ఇప్పుడది నా వంతు’ అని చెప్పుకొచ్చింది 26 ఏళ్ల అభిలాష.
ఇదీ చూడండి : పెద్దల సభలో పెరగనున్న కాంగ్రెస్ బలం.. 11 మంది ఎన్నికయ్యే అవకాశం!