ETV Bharat / bharat

గిరిజనుడికి సిరులు కురిపిస్తోన్న 'తిప్పతీగ'!

కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని వ్యాపారంలో జోరు చూపిస్తున్నాడు ఓ యువ వ్యాపారి. ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడే తిప్పతీగను కంపెనీలకు సరఫరా చేస్తూ రూ.కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాడు. ఇదంతా చేసేది ఓ గిరిజన యువకుడు. దాని ద్వారా ఎంతో మంది గిరిజనులకు ఉపాధి కల్పించడం విశేషం.

giloy plant benefits
తిప్పతీగ ఆయుర్వేదం
author img

By

Published : May 31, 2021, 5:46 AM IST

తిప్పతీగతో రూ.కోట్లు ఆర్జిస్తోన్న గిరిజన వ్యాపారి

కరోనా సంక్షోభంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతుంటే.. రూ.కోట్ల కాంట్రాక్టుతో వ్యాపారంలో దూసుకుపోతున్నాడు ఓ యువ గిరిజన వ్యాపారి. మహారాష్ట్రలోని ఠాణేకు చెందిన సునీల్​ పవార్​ అనే యువకుడు తిప్పతీగ సరఫరా కోసం ప్రముఖ సంస్థలతో రూ.1.5కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన వ్యాపారం ద్వారా వందల మంది గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నాడు.

giloy plant benefits
సునీల్​ పవార్, వ్యాపారి

షాహ్​పుర్​ తాలుకాలోని ఖరిద్​కు చెందిన సునీల్​కు.. స్థానిక అడవుల్లో లభించే ఔషధ గుణాలున్న మొక్కలపై మంచి అవగాహన ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో తిప్పతీగ(గిలోయ్) చేసే మేలు గురించి బాగా తెలుసు. రెండు సంవత్సరాల క్రితం దానిని సేకరించి.. కంపెనీలకు అందించే వ్యాపారాన్ని మొదలు పెట్టాడు సునీల్​. అందులో భాగంగా కట్కరీ తెగకు ఉపాధి కల్పిస్తూ ప్రధానమంత్రి వన్​ధన్​ పథకం సాయంతో వన్​ధన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు​. ఆ సమయంలో ఏడాదికి రూ.3 నుంచి రూ.5 లక్షలు ఆర్జించేవాడు.

giloy plant benefits
తిప్పతీగ ఏరివేత పనుల్లో

కరోనా మహమ్మారి కారణంగా తిప్పతీగకు విపరీతంగా డిమాండ్​ పెరిగింది. దీంతో డాబర్, బైద్యనాథ్, హిమాలయ వంటి సంస్థలకు 350 టన్నుల తిప్పతీగ సరఫరా చేసేందుకు అతడు ఏకంగా రూ.1.57కోట్ల కాంట్రాక్టును దక్కించుకున్నాడు. ప్రస్తుతం షాహ్​పుర్​లోనే సునీల్​కు 6 వన్​ధన్​ కేంద్రాలున్నాయి.

giloy plant benefits
తిప్ప కాయలను తీస్తోన్న మహిళలు
giloy plant benefits
తిప్పతీగ వ్యాపారం

తిప్పతీగతో లాభాలు..

ఆయుర్వేదంలో తిప్పతీగను విరివిగా వాడతారు. జ్వరం, డయాబెటిస్, హెపటైటిస్, ఆస్తమా, గుండె సంబంధిత రోగాలను నయం చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది.

giloy plant benefits
గిలోయ్ ప్యాకేజింగ్ పనులు

ఇదీ చూడండి: ఆ మూలికతో క్యాన్సర్​ నయం.. దొరికేది ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.