ETV Bharat / bharat

స్కూటీని 2కి.మీ ఈడ్చుకెళ్లిన లారీ.. తాత, మనవడు మృతి - up scooty accident latest news today

తాత, మనవడు ప్రయాణిస్తున్న స్కూటీని ఓ లారీ ఢీకొట్టి సుమారు 2 కిలోమీటర్ల మేర ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు బైక్​పై వెళ్తున్న ఓ కుటుంబం ఆగి ఉన్న ట్రాక్టర్​ను ఢీకొట్టడం వల్ల నలుగురు మరణించారు. ఈ ప్రమాదం కర్ణాటకలో జరిగింది.

A Truck Dragged A Scooty Two Died In UP
యూపీలో స్కూటీని ఈడ్చుకుంటూ వెళ్లిన ట్రక్కు ఇద్దరు మృతి
author img

By

Published : Feb 26, 2023, 5:34 PM IST

Updated : Feb 26, 2023, 6:50 PM IST

స్కూటీపై వెళ్తున్న 66 ఏళ్ల వృద్ధుడు, అతడి మనవడిని ఓ లారీ డ్రైవర్​ సుమారు 2 కిలోమీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్​ప్రదేశ్​లోని మహోబా జిల్లాలో శనివారం జరిగిందీ ఘటన.
మృతుల్లో ఒకరు విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉదిత్ నారాయణ్ చౌరాసియా. అతడి మనవడి వయసు ఆరు సంవత్సరాలు. అయితే శనివారం మార్కెట్​కు వెళ్తుండగా బీజానగర్​ మలుపు సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీస్​ అధికారి రామ్ ప్రవేశ్​ రాయ్​ చెప్పారు. లారీ ఢీకొట్టిన వెంటనే వాహనంపై ఉన్న ఇద్దరితో పాటు స్కూటీ ట్రక్కు వెనక భాగంలో ఇరుక్కుపోయింది. దీన్ని గమనించని డ్రైవర్​ దాదాపు 2 కిలోమీటర్ల వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు​.

కొందరు స్థానికులు లారీ కింద భాగంలో ఉన్న మృతదేహాల్ని చూసి.. ట్రక్కును వెంబడించి ఆపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని​ అరెస్టు చేశారు. లారీని సీజ్​ చేశారు.

ఒకే కుటుంబంలోని నలుగురు.. గర్భిణీతో సహా..
కర్ణాటక హాసన్​ జిల్లాలో ఆగి ఉన్న ట్రాక్టర్​ను బైక్​పై వెళ్తున ఓ కుటుంబం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కక్కడే మృతి చెందారు. వీరిలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, మరణించిన మహిళ గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను లోకేశ్​ ఆచారి, అతడి భార్య లక్ష్మి, కుమార్తెలు లేఖన, గానవిగా గుర్తించారు పోలీసులు.

పోలీసుల కథనం ప్రకారం.. నవిలే గేట్‌ గ్రామానికి చెందిన లోకేశ్ ఆచారి 12 ఏళ్ల క్రితం లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం లేకపోవడం వల్ల లోకేశ్​ తన సోదరి కుమార్తెలను దత్తత తీసుకొని పెంచుకుంటున్నాడు. అతడి భార్య లక్ష్మి మూడు నెలల క్రితమే గర్భం దాల్చింది. ఈ క్రమంలో లోకేశ్​ తన భార్య పిల్లలతో కలిసి హోసూర్​లోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నగ్గెహళ్లి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఎటువంటి సైన్​ బోర్డు లేకుండా ఉన్న ప్రదేశంలో ట్రాక్టర్​ నిలపడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు పోలీసులు. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Feb 26, 2023, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.