ETV Bharat / bharat

లోన్​ యాప్​ వేధింపులు 2 వేల రూపాయలు ఇచ్చి 15 లక్షలు వసూలు

author img

By

Published : Aug 13, 2022, 9:13 PM IST

Loan App Online Scam లోన్​ యాప్​ ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్నారు దుండగులు. ఇలాంటి ఘటనే కర్ణాటక చిక్కబళ్లాపుర జిల్లాలో జరిగింది. 2000 రూపాయలు రుణంగా ఇచ్చి రూ. 15 లక్షల రూపాయలకుపైగా కొల్లగొట్టారు. ఎలాగంటే.

A person who has taken a Rs 2000 loan from a loan app ends up paying Rs 15 lakh

Loan App Online Scam: ఆన్​లైన్​ లోన్​ యాప్​ ద్వారా రూ.2000 రుణం తీసుకున్న ఓ వ్యక్తి.. సైబర్ కేటుగాళ్ల బెదిరింపులకు భయపడి రూ.15 లక్షలకుపైగా చెల్లించాడు. అయినా వేధింపులు తగ్గలేదు. చివరకు విసుగు చెందిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చిక్కబళ్లాపుర జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది.. జిల్లాలోని చింతామణి నగరానికి చెందిన అజ్మత్​ ఉల్లా(37).. బెలగానహళ్లిలో ఉన్న నందిని డెయిరీలో సూపర్​వైజర్​గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం అతడికి డబ్బు అవసరం పడింది. దీంతో ఓ స్నేహితుడి సూచన మేరకు మాజిక్​ లోన్​ యాప్​లో(MAJIC LOAN APP) రూ.2000 అప్పు తీసుకున్నాడు. కొన్ని రోజులకు వడ్డీతో కలిపి రూ.3500 చెల్లించాడు. అయితే రుణం తీసుకున్న సమయంలో అజ్మత్​ తన ఆధార్​ కార్డు, పాన్​ కార్డు, ఫొటోలను అప్​లోడ్​ చేశాడు.

అజ్మత్​ ఆధార్​ కార్డు, పాన్​ కార్డు, ఫొటోను దుర్వినియోగం చేసిన ఆన్​లైన్​ మోసగాళ్లు.. 20కిపైగా వివిధ లోన్​ యాప్​లలో రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నారు. దీంతో ఆ యాప్​ల నుంచి అజ్మత్​కు ఫోన్లు తెగ వచ్చేవి. అడిగిన మొత్తాన్ని చెల్లించని నేపథ్యంలో ఫొటోను మార్ఫింగ్​ చేసి మహిళలతో నగ్నంగా ఉన్నట్లు వీడియోలను అజ్మత్​ కుటుంబసభ్యులకు పంపుతామని కేటుగాళ్లు బెదిరించారు. దీంతో భయపడిన బాధితుడు తన ఎస్​బీఐ బ్యాంక్​ ఖాతా నుంచి రూ.14,43,799 మోసగాళ్లు ఖాతాకు బదిలీ చేశాడు. అంతే కాకుండా స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని మరీ వారికి చెల్లించాడు. అయినా మోసగాళ్ల నుంచి వేధింపులు తగ్గలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు​. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి: వేధించిన యువకుడిని చెప్పులతో చితక్కొట్టిన మహిళలు

పనిచేసే బ్యాంకుకే కన్నం 20 కోట్ల విలువైన బంగారం చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.