ETV Bharat / bharat

ముస్లిం చిన్నారికి 'శివమణి'గా నామకరణం.. ఆ స్వామీజీ గుర్తుగా..!

Shivakumara swamiji Birth anniversary: కర్ణాటకకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శివకుమార స్వామీజీ 115వ జయంతి సందర్భంగా.. ఓ ముస్లిం చిన్నారికి శివమణిగా నామకరణం చేశారు కుటుంబ సభ్యులు. ఆయన ఆశయాలు, ఆలోచనలు తమకు ఆదర్శమని చెప్పారు.

Shivakumara swamiji Birth anniversary
ముస్లి బాలికకు శివమణిగా నామకరణ
author img

By

Published : Apr 1, 2022, 7:21 PM IST

Shivakumara swamiji Birth anniversary: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శివకుమార స్వామీజీ 115వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కర్ణాటక, తుమకూర్​ జిల్లాలోని సిద్ధగంగా మఠంలో 115 మంది చిన్నారులకు డాక్టర్​ శివకూమార స్వామీజీ ఆనందన సేవా ట్రస్ట్​ ఆధ్వర్యంలో సామూహిక నామకరణ మహోత్సవం చేపట్టారు. కర్ణాటకలోని రామనగర, బీదర్​, రాయ్​చుర్​ సహా ఇతర ప్రాంతాల నుంచి చిన్నారులు ఇక్కడికి వచ్చారు. అందులో ఓ ముస్లిం బాలికకు శివమణిగా పేరు పెట్టారు కుటుంబ సభ్యులు.

Shivakumara swamiji Birth anniversary
ముస్లి బాలికకు శివమణిగా నామకరణ

జిల్లాలోని క్యాత్సాంద్రకు చెందిన శహిస్టా, జమీర్​ దంపతులు వారి కుమార్తెకు శివమణిగా నామకరణం చేశారు. శివకుమార్​ స్వామీజీ ఆలోచనలు తమకు ఆదర్శమని, ఆయన సమానత్వం కోసం పాటుపడినట్లు చెప్పారు. ఆయన ఆశయాల సాధన కోసం ముందుకు సాగుతామని తెలిపారు. శివకూమర స్వామీజీ ఊపిరితిత్తుల సమస్యతో 2019లో శివైక్యమయ్యారు. ఆయన్ని నడిచే దేవుడిగా కొలిచేవారు. విద్య, వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ 2015లో పద్మ భూషణ్​ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది కేంద్రం. 2007 కర్ణాటక రత్న అవార్డును అందుకున్నారు.

మోదీ నివాళి: శివకుమార స్వామీజీ 115వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన నిశ్వార్థ సేవలతో ఎప్పటికీ ప్రజల మనుసులో నిలిచిపోతారని పేర్కొన్నారు. ట్విట్టర్​లో స్వామీజీ చిత్రాన్ని షేర్​ చేశారు. ఆయన ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

Shivakumara swamiji Birth anniversary
శివకుమార స్వామీజీతో ప్రధాని మోదీ(పాత చిత్రం)

ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య.. రాళ్లతో ముఖాలు ఛిద్రం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.