Acid Attack on Dogs: వీధి కుక్కలపై యాసిడ్ పోశాడో బాలుడు. గత కొద్ది రోజులుగా కుక్కలపై ఇదే విధంగా యాసిడ్ దాడికి తెగబడుతున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటవ చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో జరిగింది.
వివరాల్లోకెళ్తే.. రాయ్‌పుర్‌లోని కొత్వాళి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బాలుడు, కుక్కలపై దాడులకు తెగబడుతున్నాడు. ఇప్పటివరకు ఆరు కుక్కలపై యాసిడ్ పోశాడు. అందులో 5 కుక్కలు తీవ్రంగా గాయపడ్డాయి. గత 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిరంతరాయంగా వీధికుక్కలపై యాసిడ్ పోస్తున్నాడు. ఈ దృశ్యాలన్నీ స్థానిక సదర్ బాజార్‌లోని దుకాణాల్లో ఏర్పటు చేసిన సీసీటీవీల్లో రికార్డయియీయు. నాలుగు రోజుల క్రితం ఈ విషయం పీపుల్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ ప్రతినిధులకు తెలిసింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై కొత్వాళి పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఉమేంద్ర కుమార్ టండన్ స్పందించారు. కుక్కలపై దాడులు చేసిన బాలుడిపై ఫిర్యాదు అందిందన్నారు. ఫిర్యాదు ప్రకారం బాలుడిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: ఇప్పటివరకు ఆమె ఓ కానిస్టేబుల్, ఇకపై డీఎస్పీ
ఆహారం కోసం రైలు దిగిన మహిళపై గ్యాంగ్ రేప్, పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నా