ETV Bharat / bharat

విద్యుత్తు​ టవర్​ ఎక్కి యువకుడి హల్​చల్​.. కారణమిదే! - యువకుడు విద్యుత్ టవర్ ఎక్కి

తన ప్రేయసిని పెళ్లికి ఒప్పించేందుకు ఓ యువకుడు 'హైవోల్టేజ్ డ్రామా' సృష్టించాడు. ఎత్తైన విద్యుత్ టవర్​ను ఎక్కి.. దిగనని మొండికేశాడు. స్థానికులకు షోలే సినిమాను గుర్తుచేశాడు.

boy-climbed-tower-to-convince-girlfriend-for-marriage-in-ranchi
పెళ్లికి ఒప్పించేందుకు విద్యుత్ టవర్ ఎక్కి.. చివరకు!
author img

By

Published : Mar 21, 2021, 10:29 AM IST

ప్రియురాలిని పెళ్లికి ఒప్పించేందుకు అశోక్(25) అనే యువకుడు హంగామా సృష్టించాడు. ఎత్తైన విద్యుత్తు టవర్​పైకి ఎక్కి దిగనని మొండికేశాడు. ఝార్ఖండ్​ రాంచీలోని తాట్కుండో గ్రామంలో ఈ ఘటన జరిగింది.

విద్యుత్ టవర్​పై యువకుడు

నిజానికి అశోక్​ను పెళ్లిచేసుకోనని ఇదివరకే ఆ యువతి తేల్చిచెప్పింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన అశోక్.. ఓసారి బలవన్మరణానికి ప్రయత్నించాడు. రైల్వే ట్రాక్​పై పడుకొని మృతి చెందాలని భావించాడు. అది విఫలం కావడం వల్ల గ్రామానికి సమీపంలోని వంద అడుగులు ఎత్తైన విద్యుత్తు టవర్​పైకి ఎక్కాడు. ఆ సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. కిందకు దిగిరావాలని లౌడ్ స్పీకర్ల ద్వారా అశోక్​కు సూచించారు. ఎంతకీ దిగకపోవడం వల్ల.. గ్రామస్థుల సహాయంతో యువకుడు ప్రేమించిన అమ్మాయిని పిలిపించారు. యువతి పెళ్లికి ఒప్పుకున్న తర్వాత కిందకు దిగొచ్చాడు. యువకుడిని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.

షోలేను గుర్తుచేశాడు..

ఈ ఘటన ప్రముఖ హిందీ చిత్రం 'షోలే'ను గుర్తుకు తెచ్చిందని స్థానిక పోలీస్ స్టేషన్ ఇంఛార్జి రాణా జంగ్ బహదుర్ సింగ్ అన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది చర్చనీయాంశంగా మారిందని చెప్పారు.

ఇదీ చదవండి: మట్టిలో కూరుకుపోయి ముగ్గురు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.