ETV Bharat / bharat

టేకాఫ్​కు సిద్ధంగా విమానం.. అంతలోనే రన్​వేపై మంటలు...

Mumbai Airport Accident: ముంబయి విమానాశ్రయంలో రన్​వేపై ఉన్న విమానం వద్ద మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఎయిర్​పోర్ట్​ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 85 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

Mumbai Airport Accident:
విమాన ప్రమాదం
author img

By

Published : Jan 10, 2022, 3:28 PM IST

Updated : Jan 10, 2022, 6:11 PM IST

ముంబయి విమానాశ్రయంలో అగ్నిప్రమాదం

Mumbai Airport Accident: ముంబయి విమాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ముంబయి నుంచి జామ్​నగర్​కు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఎయిర్​ఇండియా విమానానికి అనుసంధానమై ఉన్న పుష్​బ్యాక్​ టగ్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్​పోర్ట్​ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలను చేపట్టారు. ఈ ఘటన సోమవారం ఉదయం 11 గంటలకు జరిగింది.

ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, ఎయిర్​పోర్ట్​లో యథావిధిగా కార్యకలాపాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 85 మంది ప్రయాణికులు ఉన్నారని.. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేశారు. కేవలం 10 నిమిషాల్లోనే మంటలను అదుపు చేశామన్నారు.

ఇదీ చూడండి : ముగ్గురు బాలికలపై రేప్​​.. తెలిసినవారేనని నమ్మి వెళ్తే...

Last Updated : Jan 10, 2022, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.