ETV Bharat / bharat

హిందూ బాలిక గుండె దానం.. ముస్లిం యువకుడికి కొత్త జీవితం - నలుగురికి అవయవదానం చేసిన యువతి

తాను చనిపోతూ మరో నలుగురికి ప్రాణం పోసింది ఓ బాలిక. ఆమె గుండె, కిడ్నీలు, కాలేయాన్ని కుటుంబసభ్యులు దానం చేశారు. బాలిక హృదయాన్ని వైద్యులు ముస్లిం యువకుడికి అమర్చారు.

hindu girl heart donate muslim
హిందూ బాలిక గుండెను ముస్లిం యువకుడికి అమర్చిన వైద్యులు
author img

By

Published : Jul 12, 2022, 1:28 PM IST

Updated : Jul 12, 2022, 2:06 PM IST

హిందూ బాలిక గుండె దానం.. ముస్లిం యువకుడికి కొత్త జీవితం

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుమార్తె బ్రెయిన్ డెడ్ అవ్వడం వల్ల ఆమె తల్లిదండ్రులు అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. మరో నాలుగు కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. బాలిక గుండెను ముస్లిం యువకుడికి అమర్చారు వైద్యులు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో సోమవారం జరిగింది.

అసలేం జరింగిందంటే: ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలికకు రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ధార్వాడ్​లోని ఎస్​డీఎం ఆసుపత్రిలో చేర్చారు. బాలిక బ్రెయిన్ డెడ్​ అయిందని ఆమె తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు. వెంటనే బాలిక అవయవాలను దానం చేసేందుకు వారు అంగీకరించారు.

బెళగావిలోని కెఎల్​ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 22 ఏళ్ల ముస్లిం యువకుడు గుండె మార్పిడి చేయాల్సి ఉంది. వెంటనే బాలిక గుండెను వైద్యులు జీరో ట్రాఫిక్​లో అంబులెన్స్​లో బెళగావిలోని కేఎల్​ఈ ఆసుపత్రికి తరలించారు. కేవలం 50 నిమిషాల్లోనే ఆసుపత్రికి చేరుకున్నారు. గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ రిచర్డ్ సల్దానా నేతృత్వంలోని బృందం 6 గంటల పాటు శ్రమించి గుండె ఆపరేషన్​ను పూర్తి చేసింది.

బాలిక కాలేయాన్ని కూడా జీరో ట్రాఫిక్ అంబులెన్స్​లో బెంగళూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి మరో వ్యక్తికి అమర్చారు. హుబ్లీలోని ఎస్​డీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి ఒక కిడ్నీ, తత్వదర్శిలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రోగికి మరో కిడ్నీని వైద్యులు అమర్చారు. దీంతో బాలిక తాను చనిపోతూ నలుగురి ప్రాణాలు కాపాడినట్లైంది.

ఇవీ చదవండి:

ప్రేమ పేరుతో వేధింపులు.. యువతిపై బ్లేడుతో దాడి.. ముఖానికి 31కుట్లు..

విద్యాశాఖ మంత్రి ఉదారత.. చికిత్స కోసం చేతి బంగారు గాజులు

Last Updated : Jul 12, 2022, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.