నాలుగు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్లోని సాంచోర్ తహసీల్ లాచ్డి గ్రామంలో బుధవారం ఉదయం పది గంటలకు జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు, ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడ్ని బోరుబావిలోంచి తీయడానికి సహాయక చర్యల్ని ప్రారంభించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
ఇదీ చదవండి: హోం ఐసొలేషన్లో ఉన్న వారికీ ఆక్సిజన్ పంపిణీ