రాజస్థాన్ షాబాద్‌లోని బారా కొవిడ్ కేర్ సెంటర్‌లో ఓ జంట పెళ్లి జరిగింది. సరిగ్గా వివాహం జరగాల్సిన తేదీన వధువుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పెళ్లి వాయిదా వేసుకోవడం ఇష్టంలేని వరుడు ఎలాగైనా అదే ముహూర్తంలో అమె మెడలో తాళి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పెళ్లికూతురుతో పాటు తాను కూడా పీపీఈ కిట్ ధరించి కొవిడ్ కేంద్రంలోనే వివాహం చేసుకున్నాడు.
పురోహితులు కూడా పీపీఈ కిట్లు ధరించి ఈ వివాహం జరిపించారు. బంధువులు, కొవిడ్ కేంద్రం నిర్వాహకులు దూరం నుంచే పెళ్లిని చూసి నూతన జంటను ఆశీర్వదించారు.
ఇదీ చూడండి: 'కరోనా ప్లాన్'తో భర్తనే కిడ్నాప్ చేయించిన భార్య