ETV Bharat / bharat

చదువుకు 'పది'తోనే స్వస్తి.. ఆలోచనలు ఆకాశానికి..!

Airplane making at home: అతనికి చదువంటే ఇష్టం. కానీ ఆర్థిక పరిస్థితులు అతన్ని పైచదువులకు దూరంచేశాయి. పూట గడిచేందుకు కూలీగా మారాడు. అయినా ఆవిష్కరణలపై ఆయనకు ఆసక్తి మాత్రం తగ్గలేదు. యూట్యూబ్ వంటి అంతర్జాల వేదికల ద్వారా స్వతహాగా నైపుణ్యం పొంది ఏకంగా చిన్నపాటి విమానాలనే తయారు చేశాడు. ఆవిష్కరణతో ఆకట్టుకుంటున్న ఆ కేరళ కుర్రాడిపై ప్రత్యేక కథనం.

airplane making
విమానాలు తయారు చేస్తున్న కేరళ యువకుడు
author img

By

Published : Feb 26, 2022, 8:11 PM IST

Updated : Feb 27, 2022, 5:29 PM IST

Airplane making at home: ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు జునైద్. కేరళ మలప్పురం చెమ్మాడ్‌కు చెందిన జునైద్ పదో తరగతిలోనే చదువు మానేశాడు. ఉన్నత చదువులు చదువుకుని.. జీవితంలో గొప్ప స్థాయికి చేరాలని ఆశపడ్డాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతడ్ని.. పదో తరగతి మధ్యలోనే చదువు మానేసేలా చేశాయి. పూటగడిచేందుకు కూలీగా మారాడు. అయినా అతని ఆలోచనలు, లక్ష్యాలు ఏమాత్రం మారలేదు. విమానం తయారు చేయాలని కలలు కనేవాడు. యూట్యూబ్ వంటి అంతర్జాల వేదికల్లో వీడియోలు చూసి నైపుణ్యం పొందాడు.

airplane making
జునైద్​ తయారు చేసిన విమానం

ఈ క్రమంలో ఎన్నోసార్లు విఫలం చెందినా.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి అనుకున్నది సాధించాడు. రిమోట్ ద్వారా నియంత్రించే చిన్నపాటి విమానాలను రూపొందించాడు. జునైద్‌ ఇప్పటివరకు 30కి పైగా రిమోట్‌ విమానాలను తయారు చేశాడు. చిన్న మోటార్లు, థర్మకోల్ షీట్లు వంటి తేలికపాటి వస్తువులను.. తయారీలో ఉపయోగించాడు. ల్యాండింగ్, టేకాఫ్‌లోనూ ఈ విమానాలు.. అచ్చం నిజమైన విమానాల్లా కనిపిస్తున్నాయి.

airplane making
రిమోట్​ కంట్రోల్​ విమానాలు

తాను తయారు చేసిన విమానాలు 500 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలవని జునైద్ చెబుతున్నాడు. రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తుంటే కాక్‌పిట్‌లో కూర్చున్న అనుభూతి కలుగుతోందని.. ఈ కేరళ కుర్రాడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. భవిష్యత్‌లో ఒక సీటు ఉండే ప్రయాణ విమానాన్ని తయారు చేయడమే.. తన లక్ష్యమని జునైద్ చెబుతున్నాడు.

ఇదీ చూడండి:

పట్టాలపై పడిపోయిన వ్యక్తి.. దూసుకొచ్చిన రైలు.. తర్వాత?

Last Updated : Feb 27, 2022, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.