Baby Born With Two Noses : గుజరాత్‌లోని సాబర్కాంఠా జిల్లాలో ఓ గర్భిణీ రెండు ముక్కులున్న చిన్నారికి జన్మనిచ్చింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. హిమ్మత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో జన్మించిన ఆ చిన్నారిని.. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి 8 వేల నుంచి 15 వేల మంది శిశువుల్లో ఒకరు ఈ విధంగా జన్మిస్తున్నారని వైద్యులు తెలిపారు.
భవిష్యత్తులో ఆపరేషన్ ద్వారా చిన్నారి మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా ప్రయత్నం చేస్తామని పీడియాట్రిషియన్ డాక్టర్ ధవల్ పటేల్ తెలిపారు. ఇలాంటి అరుదైన పిల్లల పరిస్థితి సాధారణంగా ఉంటే.. వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. జన్యుపరమైన వ్యాధుల కారణంగా ఒకటి కంటే ఎక్కువ అవయవాలతో పిల్లలు పుడతారని తెలిపారు. ఇలాంటి సమయాల్లో శస్త్రచికిత్సలు చేసి పిల్లలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారని.. దీనికి కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు కూడా అవసరమని చెప్పారు.
రెండు గుండెలు, నాలుగు చేతులు, కాళ్లతో చిన్నారి..
Baby Born With Two Hearts : ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్‌లోని చురూలో ఓ వింత శిశువు జన్మించింది. రతన్‌గఢ్‌లోని గంగారామ్ ప్రైవేట్ ఆస్పత్రిలో 19 ఏళ్ల గర్భిణీ నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న చిన్నారికి జన్మనిచ్చింది. ఆ శిశువుకు రెండు గుండెలు, వెన్నెముకలు ఉన్నాయి. హజారీ సింగ్ అనే గర్భిణీ ప్రసవ నొప్పులతో గంగారామ్ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించగా అందులో వింత శిశువు కనిపించిందని ఆస్పత్రి వైద్యుడు కైలాశ్ తెలిపారు. ఆస్పత్రిలో చేరిన గంట తర్వాత హజారీ సింగ్ నార్మల్ డెలివరీ అయ్యిందని చెప్పారు. పుట్టిన 20 నిమిషాల తర్వాత నవజాత శిశువు మరణించిందని వైద్యులు వెల్లడించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
మూడు తలలతో పుట్టిన చిన్నారి.. ఆ తర్వాత..
Baby With Three Heads : ఇలాంటి ఘటనే 2021లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. మూడు తలలతో జన్మించింది ఓ నవజాత శిశువు. ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.