ETV Bharat / bharat

రన్నింగ్​ రేసులో అదరగొట్టిన వృద్ధులు​.. 72 ఏళ్ల వ్యక్తికి బంగారు పతకం - రన్నింగ్​ రేసులో అదరగొట్టిన 72 ఏళ్ల సురీందర్

72 ఏళ్ల వృద్ధుడు.. పరుగు పందెంలో బంగారు పతకం సాధించారు. పంజాబ్​లోని లూధియానాలో జరుగుతున్న మినీ ఒలింపిక్స్​ క్రీడా పోటీల్లో పాల్గొన్న ఆయన.. అందరి చూపును తనవైపు తిప్పుకున్నారు.

a-72-year-old-mans-race-became-the-center-of-attraction-in-the-kila-raipur-games-ludhiana

author img

By

Published : Feb 5, 2023, 10:32 AM IST

Updated : Feb 5, 2023, 11:14 AM IST

రన్నింగ్​ రేసులో అదరగొట్టిన 72 ఏళ్ల సురీందర్

పంజాబ్​లోని లుధియానాలో మినీ ఒలింపిక్స్​​ క్రీడా పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. యువకులు, పిల్లలతో పాటు వృద్ధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 70 ఏళ్ల వయసు వచ్చినా.. తగ్గేదేలా అంటూ సీనియర్​ సిటిజన్లు.. శనివారం జరిగిన పరుగు పందేల్లో పాల్గొన్నారు. 100 మీటర్ల రన్నింగ్​ రేసులో సురీందర్​ శర్మ అనే వృద్ధుడు బంగారు పతాకాన్ని సాధించారు. దాంతో పాటు 200 మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్​ రేసులో కూడా ఆయన పాల్గొన్నారు. 72 ఏళ్ల వయసు వచ్చినా తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని సురీందర్ శర్మ తెలిపారు.

"ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తాను. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తింటాను. పంజాబ్​తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన పోటీలకు వెళ్తుంటాను. ఇప్పటికే చాలా పతకాలు సాధించాను. ముఖ్యంగా నేటి యువతరం తమ శరీర ధారుడ్యం పట్ల శ్రద్ధ వహించాలి. డ్రగ్స్​కు దూరంగా ఉండాలి" అంటూ సురీందర్​ శర్మ చెప్పుకొచ్చారు.

"నా వయసు 76 ఏళ్లు. సైన్యంలో విధులు నిర్వర్తించాను. 1965 నుంచి క్రీడల్లో పాల్గొంటున్నాను. 100 మీటర్లు, 800 మీటర్లు, 5 కి.మీ, 21 కి.మీ పరుగు పందేల్లో ఎన్నో జాతీయ పతకాలు సాధించాను."
-బల్బీర్​ సింగ్​, పోటీల్లో పాల్గొన్న మరో వృద్ధుడు

"100 మీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు అనేక రన్నింగ్​ రేసుల్లో పాల్గొన్నాను. అమృత్​సర్​కు చెందిన నేను.. అనేక పోటీల్లో పతకాలు కూడా సాధించాను. యువత డ్రగ్స్​కు దూరంగా ఉండి.. శరీర ధారుడ్యంపై శ్రద్ధ పెట్టాలి" అని 74 ఏళ్ల జర్నైల్​ సింగ్​ తెలిపారు.

Last Updated : Feb 5, 2023, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.