ETV Bharat / bharat

డ్రగ్స్ ఇచ్చి బాలికపై 9 మంది అత్యాచారం! - crime in rajasthan

రాజస్థాన్​లో అత్యాచారానికి సంబంధించిన రెండు వేరువేరు ఘటనలు బయటకు వచ్చాయి. 15ఏళ్ల బాలికపై 9 మంది.. 8 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది ఝలావర్​​లో జరిగింది. మరోవైపు పోలీస్​ స్టేషన్​కు వెళ్లిన ఓ వివాహితపై పోలీసు అధికారి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన అల్వార్​లో వెలుగు చూసింది.

9-people-gang-rape-with-a-minor-after-feeding-her-a-drug-in-kota
మత్తుపదార్థాలు ఇచ్చి.. 8 రోజులు పాటు..
author img

By

Published : Mar 8, 2021, 7:37 PM IST

రాజస్థాన్​ ఝలావర్​లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 15ఏళ్ల బాలికపై.. తొమ్మిది మంది.. 8 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.

వారి నుంచి తప్పించుకున్న ఆ బాలిక.. శుక్రవారం ఇంటికి చేరిందని, అనంతరం కుటంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేశారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు.

"ఫిబ్రవరి 25న, స్కూల్​ బ్యాగు కొనిస్తానని చెప్పి.. తన స్నేహితుడు బుల్​బుల్ మరో వ్యక్తితో కలిసి.. తనను ఝలావర్​​ నగరానికి తీసుకెళ్లినట్టు బాధితురాలు చెప్పింది" అని సుకేత్​ డీఎస్​పీ మంజీత్​ సింగ్​ వెల్లడించారు.

ఓ పార్కుకు తీసుకెళ్లి.. తనకు మత్తపదార్థాలు ఇచ్చారని, ఆ సమయంలో మరో ముగ్గురు అక్కడికి వచ్చారని ఆమె వివరించినట్టు డీఎస్​పీ స్పష్టం చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

పోలీస్​ స్టేషన్​లో...

ఫిర్యాదు కోసం పోలీస్​ స్టేషన్​కు వెళ్లిన ఓ వివాహితపై ఓ పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్​లోని అల్వార్​లో జరిగింది. ఈ నెల 2న స్టేషన్​లో పరిసరాల్లోని ఓ గదిలో అత్యాచారం చేశాడు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రాగా... ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఆ ఎస్​ఐని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్​లోని పలువురిని సస్పెండ్​ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తును ఓ మహిళా అధికారికి అప్పగించారు.

ఇదీచూడండి:- యూపీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.