ETV Bharat / bharat

సంపదలో భాజపానే టాప్​.. తరువాతి స్థానాల్లో ఎవరంటే?

ADR report 2022: దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా భాజపా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. 2020-21 సంవత్సర ఆదాయానికి సంబంధించిన గణాంకాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్) విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే పార్టీల ఆదాయం భారీగా తగ్గింది.

adr report 2022
ఏడీఆర్ నివేదిక
author img

By

Published : Jun 17, 2022, 8:12 PM IST

ADR report 2022: జాతీయ పార్టీల ఆదాయ వివరాల నివేదికను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) శుక్రవారం విడుదల చేసింది. 2020-21 సంవత్సరానికి గానూ ఎనిమిది జాతీయ పార్టీలు రూ.1,373.78 కోట్ల ఆదాయాన్ని పొందాయని నివేదిక వెల్లడించింది. ఇందులో ఒక్క భారతీయ జనతా పార్టీ వాటానే 55 శాతమని పేర్కొంది.

రూ.752.33 కోట్లతో భాజపా మొదటి స్థానంలో ఉండగా, రూ.285.76 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 79.24 శాతం మేర భాజపా ఆదాయం తగ్గింది. అప్పట్లో రూ.3,623 కోట్లు కాగా తాజాగా రూ.752.33 కోట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఆదాయం కూడా అప్పటితో పోల్చితే 58.11 శాతం తగ్గింది. టీఎంసీ, ఎన్‌సీపీ, బీఎస్పీ, ఎన్​పీపీ, సీపీఐ ఆదాయం కూడా భారీగానే తగ్గింది. అన్ని పార్టీల కంటే గరిష్ఠంగా భాజపా ఖర్చు చేసింది. సుమారు రూ.566 కోట్ల మేర ప్రచారానికి వెచ్చించింది. రూ.180 కోట్ల ఖర్చుతో కాంగ్రెస్ తరువాతి స్థానంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ రూ.93 కోట్లు ఖర్చు చేసింది.

ఎన్నికల సంఘం వినతి: ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై నిషేధమైనా విధించాలి, లేదంటే జరిమానా అయినా విధించాలని ప్రభుత్వాన్ని.. కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. సుమారు ఇరవై ఏళ్ల క్రితమే వచ్చిన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు మళ్లీ తీసుకొచ్చింది. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి గెలిచినా.. అతను ఒక స్థానానికి రాజీనామా చేస్తున్నారు. అప్పుడు ఉపఎన్నిక అనివార్యమవుతుంది. అనంతరం ఎన్నికల నిర్వహణకు అయ్యే ఆర్థిక భారం ప్రభుత్వ ఖజానాపై పడుతోందని తెలిపింది. అంతేగాక ఎన్నికల సమయంలో సిబ్బంది చాలా మంది అవసరమవుతున్నారని పేర్కొంది.

రెండు స్థానాల్లో పోటీ చేసి గెలుపొందిన వారు ఒక స్థానానికి రాజీనామా చేస్తే జరిమానా విధించాలని సూచించింది ఈసీ. శాసనసభ, శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసి రాజీనామా చేసిన వారికి రూ.5 లక్షలు, లోక్‌సభకు పోటి చేసే అభ్యర్థులకు రూ.10 లక్షలు జరిమానాగా విధించాలని ప్రతిపాదించింది. 1996లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా నియంత్రించారు. అంతకుముందు వరకు ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల్లోనైనా పోటీ చేసే వీలుండేది.

ఇవీ చదవండి: ఈ ఏడాదే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు!

అగ్నిపథ్​పై నిరసనలతో టెన్షన్​ టెన్షన్​.. భద్రత కట్టుదిట్టం.. రైళ్లు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.