తమిళనాడులోని తిరుచురాపల్లి విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి పెద్దమొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన 10 మంది ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న 8.5 కిలోల పుత్తడిని గుర్తించి సీజ్ చేశారు.
ప్రయాణికులు తమ శరీరంలో దాచిపెట్టి బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు యత్నించారని అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.