ETV Bharat / bharat

ఐదుగురితో వివాహేతర సంబంధం.. రాళ్లతో దాడి చేయించి వృద్ధ ప్రియుడి హత్య - రాజస్థాన్​లో వివాహితపై రేప్

ఓ వితంతువు ఐదుగురు వృద్ధులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే అందులో ఒక వృద్ధుడిని మిగతా నలుగురితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన బిహార్​లో జరిగింది. మరోవైపు, వివాహితకు కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన రాజస్థాన్​లో వెలుగుచూసింది.

murder
వృద్ధుడి హత్య
author img

By

Published : Nov 29, 2022, 9:39 AM IST

బిహార్ నలందాలో దారుణం జరిగింది. 75 ఏళ్ల వృద్ధుడిని హత్యచేసి.. టాయిలెట్ ట్యాంక్​లో పడేశారు నలుగురు వ్యక్తులు. అక్టోబరు 18న జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. అయితే ఈ కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. పోలీసుల దర్యాపులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పిను దేవీ(30) అనే వితంతువు టీ దుకాణం నిర్వహిస్తుండేది. కృష్ణనందన్ ప్రసాద్ (75), సూర్యమణి కుమార్ (60), వాసుదేవ్ పాశ్వాన్ (63), లోహా సింగ్ (62) అనే వ్యక్తులు ఆమె టీ దుకాణానికి వచ్చేవారు. అలా వీరు నలుగురు పిను దేవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. కొన్నాళ్ల తర్వాత తృపిత్ శర్మ (75) అనే వృద్ధుడు టీ దుకాణానికి వచ్చి పిను దేవితో సన్నిహితంగా ఉండేవాడు. అలా వీరిమధ్య కూడా వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం మిగతా నలుగురు ప్రియులకు తెలిసింది. తృపిత్ శర్మ రావడం మిగతా నలుగురికి నచ్చలేదు. త్రిపిత్ శర్మతో సంబంధం తెంచుకోమని పినూ దేవిని హెచ్చరించారు.

ఈ క్రమంలో తృపిత్​ శర్మను హత్య చేసేందుకు పిను దేవి.. తన నలుగురు ప్రియులతో కలిసి ప్లాన్ చేసింది. ఇంటికి రమ్మని తృపిత్​ను పిలిచింది. పథకం ప్రకారం తన నలుగురు ప్రియులు రాళ్లతో తృపిత్​పై దాడి చేసి హతమార్చారు. అనంతరం టాయిలెట్ ట్యాంక్​లో పడేశారు. అక్టోబరు 21న మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. తాజాగా ఈ కేసును ఛేదించి.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్​ కాల్స్ ఆధారంగానే నిందితులను గుర్తించామని తెలిపారు.

కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి..
రాజస్థాన్ జైపుర్​లో దారుణం జరిగింది. 25 ఏళ్ల వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. నిందితుడు.. బాధితురాలిని తన స్నేహితుడి ఇంటికి పిలిచాడు. అక్కడ ఆమెకు కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. కూల్​డ్రింక్ తాగిన మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని వీడియో తీశాడు. అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే.. అసభ్యకర వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. జూన్​ 17న జరిగిన ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. నిందితుడు తనకు తెలిసినవాడేనని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.