బిహార్లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. వైశాలి జిల్లాలోని సేలంపుర్ ప్రాంతంలో ఓ వృద్ధుడు తమ అనుమతి లేకుండా బోరునీళ్లు తాగాడని 70ఏళ్ల వృద్ధుడిని చితకబాదాడు యజమాని. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు .. శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.


"మా నాన్న పశువులకు గడ్డి తెచ్చేందుకు వెళ్లాడు. దాహం వేసి నీటి కోసం బోరుపంపు వద్దకు వెళ్లాడు. తమ అనుమతి లేకుండా నీళ్లు తాగాడన్న కోపంతో ఓ వ్యక్తి, అతని తండ్రి.. మా నాన్ను కొట్టారు. తర్వాత అతను మరణించాడు. వారితో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు" అని మృతుడి కుమారుడు రమేశ్ సైని కంటితడి పెట్టుకున్నాడు.

"ఆ వృద్ధుడిని అదే కులానికి చెందిన కొందరు కొట్టారు. దీంతో శనివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు" అని పోలీసు అధికారి రాఘవ్ దయాల్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: వీధిలో యువకుడి బీభత్సం- మహిళపై కర్రతో దాడి